Covid Treatment: రోజుకు రూ.లక్ష ఉంటేనే కొవిడ్ ట్రీట్మెంట్

కొవిడ్-19తో పోరాడే క్రమంలో పలువురు ఆపన్న హస్తం అందిస్తుంటే.. మరి కొందరు ప్రాణాలకు తెగించి కష్టపడుతుంటే...

Covid Treatment: రోజుకు రూ.లక్ష ఉంటేనే కొవిడ్ ట్రీట్మెంట్

Covid Treatment

Covid Treatment: కొవిడ్-19తో పోరాడే క్రమంలో పలువురు ఆపన్న హస్తం అందిస్తుంటే.. మరి కొందరు ప్రాణాలకు తెగించి కష్టపడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు దండుకోవడంలో ముందున్నాయి. గవర్నమెంట్ ఫీజులు ఫిక్స్ చేసినా వారి దౌర్జన్యానికి అంతులేకుండాపోతుంది. రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష ఉంటే కొవిడ్ ట్రీట్మెంట్ సాధ్యపడుతుందని ఫిక్స్ అయిపోవాలంతే..

22 నర్సింగ్ హోంలకు కొవిడ్ ట్రీట్మెంట్ కోసం అనుమతులు ఇచ్చి ఇన్ఫెక్షన్ తో ఉన్న వాళ్లకు సహాయం అందించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు.

మహారాష్ట్ర నుంచి వచ్చిన కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కొవిడ్ పాజిటివ్ కు గురయ్యారు. ఐబీ చౌక్ వద్ద హాస్పిటల్ లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే ఒకరు రెండ్రోజుల్లోనే చనిపోయారు. వారందరికీ కలిపి నాలుగు రోజుల ట్రీట్మెంట్ కు హాస్పిటల్ వేసిన ఛార్జ్ రూ.8లక్షలు.

కొద్ది రోజుల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 32ఏళ్ల పేషెంట్ ను హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బెల్లంపల్లి క్రాస్ రోడ్స్ లో ఉన్న హాస్పిటల్ లో రోజుకు రూ.70వేలు ఛార్జ్ అవుతుందని డిమాండ్ చేయడంతో చెల్లించలేనని చెప్పిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పంపించేశారు.

టౌన్ నుంచి వచ్చిన వ్యక్తికి ఆరు రోజుల పాటు ట్రీట్మెంట్ అందించి రూ.7.5లక్షల బిల్లును బాదారు. అంటే రోజుకు రూ.1.25లక్షలు. ఆ కుటుంబ సభ్యులు తాము చెల్లించలేమంటూ మొరపెట్టుకుంటే కనికరం చూపించిన మేనేజ్మెంట్ రూ.లక్ష డిస్కౌంట్ ఇచ్చింది.

ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్ల నుంచి ఏ రేంజ్ లో వసూలు చేస్తున్నాయో స్పష్టమవుతోంది. అకారణంగానే చాలా నర్సింగ్ హోంలు అదనంగా వసూలు చేస్తున్నాయి. స్పెషలిస్టులు వస్తారు.. మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మందులు మామూలు రేటుకు దొరకడం లేదని చెప్పి ఎక్స్ ట్రా లాగేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను పట్టించుకోకుండా సొంత రేట్లను రుద్దుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్ 248 ప్రకారం.. హాస్పిటల్స్ ఆర్టీ-పీసీఆర్ టెస్టుకు రూ.2వేల 200, ఇంటికి వెళ్లి చేస్తే రూ.2వేల 800గా నిర్ణయించింది. కొవిడ్ పేషెంట్ కు రోజుకు అయ్యే ఖర్చును రూ.4వేలుగా ఫిక్స్ చేసింది. ఐసీయూలో చేరితే రోగికి రోజుకు రూ.7వేల 500, వెంటిలేటర్ సహాయంతో ట్రీట్మెంట్ అందిస్తే రూ.9వేలు ఉండాలని చెప్పింది. అంతేకాకుండా హాస్పిటల్స్ ఫీజులు వాటికి అయ్యే రేట్లను డిస్ ప్లే చేయాలని ఆదేశాలిచ్చింది.

కొన్ని హాస్పిటల్స్ రెమెడెసివర్ కొరత ఉందని ఉందని, ఆక్సిజన్ లేదని, ఇన్ ఫ్లక్స్ సమస్య ఉందని అదనపు వసూళ్లు మొదలుపెట్టాయి. రూ.30వేల నుంచి రూ.70వేల వరకూ మందుల కోసం లాగేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆప్షన్ లేక అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితుల్లో పేషెంట్లు కనిపిస్తున్నారు. అధికారులు ఫీజులు సమీక్షించే పనిలో రైడ్ లు నిర్వహించాలని కోరుతున్నారు.

డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా.శ్రీరామ్ అటువంటి హాస్పిటల్స్ పై యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎవరైనా ఎక్కువ అడిగితే కంప్లైంట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రెమెడెసివర్ ఇంజెక్షన్లను నేరుగా హాస్పిటల్స్ కు అందజేస్తుంది. వాటి కోసం అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. నర్సింగ్ హోమ్స్ ఫీజు వివరాలను తప్పకుండా డిస్ ప్లేలో ఉంచాలి.