Yellow Alert : తెలంగాణలో తీవ్ర వడగాలులు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!

మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Yellow Alert : తెలంగాణలో తీవ్ర వడగాలులు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ!

Yellow Alert _ Three Days Severe heatwave warning from IMD as temperatures in Telangana

Yellow Alert : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also : Rain Alert : రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

పలు జిల్లాలకు వడగాలుల ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్ నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పగటి పూట ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వచ్చాయన్నారు. గరిష్టంగా సాధారణంగా కన్నా మూడు డిగ్రీలకు పైగా పెరిగాయని చెప్పారు. ఈనెల చివరి వారంలో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

మే నెలలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యే అవకాశం :
మే నెలల్లో ఇప్పటికే కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యో అవకాశం ఉంది. ఈ ఏడాది వేసవిలో దక్షిణ తెలంగాణా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అయ్యాయి. ఏప్రిల్ నెల చివరి వారంలో మే నెలలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన :
ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Read Also : Hyderabad Rain : ఒక్కసారిగా మారిన వాతావరణం.. మరో రెండు రోజులు వర్షాలు