Jagga Reddy : మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు- జగ్గారెడ్డి

నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.

Jagga Reddy : మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు- జగ్గారెడ్డి

Jagga Reddy : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఈసారి మోడీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జగ్గారెడ్డి అన్నారు. మోదీ.. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తేవడం వల్ల లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. మోదీ 400 సీట్లు గెలుస్తాం అంటున్నారు, గెలిచి ఏం చేస్తారు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

”తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి. కాంగ్రెస్ లో చేరతామని ఒత్తిడి వస్తోంది. పార్టీలో చేరతామని ఏఐసిసికి లేఖలు రాస్తున్నారు. రెండు రోజుల్లో గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయి. ఎవరు వచ్చి పార్టీలో చేరతామన్నా కండిషన్ తో చేర్చుకుంటాము. తెలంగాణలో త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సభలు ఉంటయి. మే 1 నుంచి ప్రచారంలో పాల్గొంటా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయండి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలవుతాయి.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్న మోదీ హామీ ఏమైంది? దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేపట్టారు. బీజేపీ చేసిన నయవంచన పేరుతో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు. ఈసారి మోదీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు” అని హెచ్చరించారు జగ్గారెడ్డి.

Also Read : రిజర్వేషన్ల రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి