Agnipath : ఆర్మీ జవాన్ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి
ఆర్మీ జవాన్ కావాలని కలలుకన్న వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేశ్ ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి చెందాడు. ఆర్మీ జవాన్ కావాలన్న అతని కల నెరవేరకుండాను ఆందోళనలో అశువులుబాసాడు.

Protest against Agnipath: ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్న యువకుడు త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ఆందోళనల్లో అసువులుబాసాడు. బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న తన సోదరిని స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవ చేయాలని ఆర్మీలో జవాన్ కావాలని ఎన్నో కలలు కన్న రామోదరం రాకేశ్ అనే యువకుడు సికింద్రాబాద్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తూటాలకు అతని నూరేళ్ల జీవితం ఛిద్రమైపోయింది. ఆందోళనల్లో అతని భవిష్యత్తు కాలి బూడిదైపోయింది.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ ను వత్యిరేకిస్తు వెల్లువెత్తిన ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసకాండలో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ తగలడంతో చనిపోయాడు. రాకేశ్ స్వస్థలం వరంగల్ జిల్లా దబిడిపేట. కొన్నాళ్లుగా రాకేశ్ ఆర్మీ పోలీస్ శిక్ష పొందుతున్నాడు. బీఎస్ఎఫ్ లో పనిచేస్తున్న సోదరి రాణిని చూసి రాకేశ్ స్ఫూర్తి పొందాడు.దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆర్మీ పోలీసు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈక్రమంలో అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించటం నాలుగు ఏళ్ల పాటు మాత్రమే ఆర్మీలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని నిబంధనతో రాకేశ్ తీవ్రంగా నిరాశచెందాడు. తన కన్నకలలు కల్లలు అయిపోయాయని తీవ్ర ఆవేదన చెందాడు. రాకేశ్ లాగానే దేశ వ్యాప్తంగా ఉన్న యువత కూడా అగ్నిపథ్ పథకం ప్రకటన తరువాత తీవ్ర నిరాశ చెందారు. ఆందోళనలకు చేపట్టారు.
ఈ ఆందోళనల్లోనే రాకేష్ చనిపోయాడన్న వార్తతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా దబ్బీర్ పేట గ్రామానికి చెందిన రాకేష్.. ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్నాడు. ఆర్మీ రిక్రూట్మెంట్లో నిబంధనలు మార్చడంతో.. ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్నాడు. అక్కడ పోలీసుల కాల్పుల్లో చనిపోవడంతో అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు.
Also read : Minister Kishan Reddy: ’అగ్నిపథ్‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..
రాకేశ్ సోదరి సంగీత కూడా అర్మీ జవాన్‌గానే పనిచేస్తున్న ఆమె BSF జవాన్‌గా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో డ్యూటీ నిర్వహిస్తున్నారు. అక్క ప్రోత్సాహంతోనే ఆర్మీలో చేరాలని కఠోర సాధన చేశాడు రాకేశ్. హైదరాబాద్ కు మూడు రోజుల క్రితం వచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
- BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
- Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
- Telangana: హనుమకొండలో నిరసనల పేరుతో కాంగ్రెస్ దాడులకు తెగబడింది: ఎంపీ ఓం ప్రకాశ్
- bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
- TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
1Vishal : చంద్రబాబుపై పోటీ గురించి స్పందించిన హీరో విశాల్
2New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల
3Uddhav Thackeray: షిండేకు షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన నుంచి బహిష్కరణ
4Japan: జపాన్‌లో మండుతున్న ఎండలు.. 147 ఏళ్ల గరిష్ట స్థాయి రికార్డు
5Neeraj Chopra: అభిమాని కాళ్లు పట్టుకున్న నీరజ్ చోప్రా
6DRDO: మానవ రహిత విమానాన్ని పరీక్షించిన డీఆర్డీఓ.. ప్రయోగం సక్సెస్
7Gorintaku : ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు
8Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
9Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
10BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి