Big Shock BRS : ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు.. మరో నలుగురు నేతలు రాజీనామా!

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

Big Shock BRS : ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు.. మరో నలుగురు నేతలు రాజీనామా!

Big shock to BRS

Big Shock BRS : ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. టికెట్ రాని ఆశావహులు గులాబీ జెండాను వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

కాంగ్రెస్ గూటికి ఆకుల లలిత!

తాజాగా పలువురు నేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరో ఇద్దరు రాజీనామా చేయనున్నారు. నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ లో చేరనున్నారు. రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు.

KCR : ప్రచార పర్వంలో గులాబీ బాస్ జోష్.. నేడు సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

బీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదని, స్థానిక సంస్థల హక్కైన స్వయంపాలన లేకుండా చేశారని, ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బానిసలుగా చేశారని లేఖలో ఆమె పేర్కొన్నారు. కాగా, లలిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అక్టోబర్ 20న రాహుల్ గాంధీ నిజామాబాద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆకుల లలితకు నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా : నీలం మధు
మరోవైపు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని, బీఆర్ఎస్ తో తన బంధం ముగిసిందని తెలిపారు.
సోమవారం గుమ్మడివరం మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.

Revanth Reddy : పాలమూరు – రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కేసీఆర్ కారణం కాదా? రేవంత్ రెడ్డి

తాను 22 ఏళ్లుగా బీఆర్ఎస్ తో అనుబంధంగా ఉండి అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లానని తెలిపారు. కానీ, అధిష్టానం తన కష్టాన్ని గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుస్తానని మధు ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ లో చేరనున్న  జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్
మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి, హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత గౌడ్ లు
బీఆర్ఎస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరు పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ఊహాగానాలను జగదీశ్వర్ గౌడ్ ఖండించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పార్టీ కేడర్ కు స్పష్టమైన సంకేతాలిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

BJP : 18న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల? 30 నుండి 35 సీట్లు వారికే..!

అక్కడి నుంచి నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రావాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు. జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఇతర బీఆర్ఎస్ నేతలు ఎవరు వెళ్తారన్న ఆసక్తి నెలకొంది.