Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కేసీఆర్ ఆరోగ్యంపై డీకే అరుణ సంచలన కామెంట్స్

సీఎం కావాలని కేటీఆర్ ఆరాటపడొద్దని అన్నారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని డీకే అరుణ కోరారు.

Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కేసీఆర్ ఆరోగ్యంపై డీకే అరుణ సంచలన కామెంట్స్

Chikoti Praveen

Updated On : October 7, 2023 / 2:41 PM IST

DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సమక్షంలో ఆ పార్టీలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ చేరారు. హైదరాబాద్ లోని బర్కత్‌పుర బీజేపీ నగర కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాన్ని మంత్రి కేటీఆర్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నట్లు చెప్పారు. సీఎం కావాలని కేటీఆర్ ఆరాటపడొద్దని అన్నారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక ఫామ్ హౌస్ లో ఉంటే ఆయనను కేటీఆర్ పట్టించుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంటే తనకేంటి అన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా తన మామ కేసీఆర్ కు ఎలా ఉందని కూడా చూడడం లేదని ఆరోపించారు.

హరీశ్ రావు, కేటీఆర్ ఉరుకులాట సీఎం పదవి కోసమేనని తెలిపారు. ఎన్నికల వేళ కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇళ్లు, బీసీ బంధుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారి ఎన్నికల గిమ్మిక్కులను ప్రజలు నమ్మొద్దని అన్నారు.

Kinjarapu Atchannaidu : టీడీపీ ఈసారి 175 స్థానాల్లో గెలవడం ఖాయం.. అంతా ఆయన వల్లే..