KCR On Early Elections : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ.. పార్టీ నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పట్లో ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.

KCR On Early Elections : ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ.. పార్టీ నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు

KCR On Early Elections : ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు గులాబీ బాస్. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదన్న గులాబీ బాస్.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సూచించారు. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలని, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలన్నారు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను తన దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలిచి మూడోసారి అధికార పగ్గాలు దక్కించుకుంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

”అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలి. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ పర్యవేక్షించాలి. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీయాలి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను నా దృష్టికి తీసుకురావాలి. వచ్చే ఎన్నికల్లో కూడా మనం గెలిచి మూడోసారి అధికార పగ్గాలు దక్కించుకుంటాం” అని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తుకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన కీలక సమావేశంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి మరో ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించాలన్నారు. 10 రోజుల్లో ఇంఛార్జుల నియామకం పూర్తి కావాలన్నారు. బీజేపీతో ఇక యుద్దమేనని స్పష్టం చేశారు. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్ లోనే ఉండాలని, క్యాలెండర్​ బేసిస్​గా వర్క్​ చేయాలని సూచించారు గులాబీ బాస్.

తెలంగాణ భ‌వ‌న్‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ ప్రారంభ‌మైన ఈ స‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌త‌తో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చ జరిగింది.