CM KCR Vikarabad Tour : నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌..నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ వికారాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు.. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

CM KCR Vikarabad Tour : నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌..నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ప్రారంభం

CM KCR Vikarabad Tour

CM KCR Vikarabad Tour : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ వికారాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు.. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం టూర్‌ ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. వికారాబాద్‌ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బహిరంగసభను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్‌కు వికారాబాద్‌ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉన్నదని, జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం పలు అభివృద్ది పథకాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అనంతగిరిలో మెడికల్‌ కాలేజీ కోసం 30 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. తొలి విడతలోనే జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను మంజూరు చేశారని గుర్తుచేశారు.

Telangana CM KCR: రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది.. దేశానికి దిక్సూచిగా మారింది.. జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్ .. కేంద్రంపై మండిపాటు

సమీకృత కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా 60కోట్ల 70 లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టామన్నారు. ఇక సీఎం పర్యటన కోసం 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 స్పెషల్‌ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటాయి. సీఎం వచ్చే రూట్‌లో రూఫ్‌ టాప్‌లు, డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలతో గట్టి నిఘాను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.

ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ల్యాండ్‌ అయిన తర్వాత సీఎం కేసీఆర్‌.. నేరుగా టీఆర్‌ఎస్‌ భవన్‌కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నెపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు.