Inter Board : తెలంగాణ ఇంటర్ పరీక్షలు..ఇంటర్ బోర్డు క్లారిటీ

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది.

Inter Board : తెలంగాణ ఇంటర్ పరీక్షలు..ఇంటర్ బోర్డు క్లారిటీ

Ts Inter Exam

 TS Inter Examination : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌ బోర్డ్‌ క్లారిటీ ఇచ్చింది. మే 1 నుంచి తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. జాతీయ స్థాయిలో అనేక ప్రవేక్ష పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. తెలంగాణ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా మే 1 నుంచే ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డ్‌ అధికారులు తెలిపారు.

తెలంగాణలో కరోనా వ్యాప్తితో కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం కాలేజ్‌లను మూసేసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్‌లో పరీక్షలు జరుగుతాయా, లేదా అన్న ఆందోళన పెరిగిపోయింది. ఈ విషయంపై 10టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డ్‌ స్పష్టత ఇవ్వాలంటూ వార్తలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఇంటర్‌బోర్డ్‌ అధికారులు… షెడ్యూల్‌ ప్రకారమే మే 1 నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

–  మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
–  మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి.
–  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌.

–  ఏప్రిల్‌ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష.
–  ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష.
–  ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తింపు.