Hyderabad : ఆ యువతి చేసేది ఐటీ ఉద్యోగం..అమ్మేది గంజాయి..అరకు నుంచి సరుకు తెచ్చి హైద్రాబాద్ లో అమ్మకాలు..

ఆమె చేసేది ఐటీ ఉద్యోగం..అమ్మేది గంజాయి..అరకు నుంచి సరుకు తెచ్చి హైద్రాబాద్ లో అమ్మకాలు జరుపుతున్న యువతితో పాటు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad : ఆ యువతి చేసేది ఐటీ ఉద్యోగం..అమ్మేది గంజాయి..అరకు నుంచి సరుకు తెచ్చి హైద్రాబాద్ లో అమ్మకాలు..

It Employee Arrest Selling Cannabis

it employee arrest selling cannabis in hyderabad : చేసేది ఐటీ ఉద్యోగం..కానీ ఈజీ మనీ కోసం సైడ్ బిజిసెన్ గా మత్తుమందుల అమ్ముతున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ నిపుణుల్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవటం చేతినిండా డబ్బులు సంపాదించటమే పనిగా పెట్టుకున్న ఓ ఐటీ ఉద్యోగినికి పోలీసులు అరదండాలు వేశారు. ఈజీ మనీకోసం పడిన కక్కుర్తికాస్తా అరెస్ట్ అయ్యేలా చేసింది. విశాఖ సమీపంలో ఉన్న అరకు నుంచి సరకు తీసుకొచ్చి హైదరాబాద్ మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని కొండపనేని మాన్సీని బోయిన్‌పల్లి పోలీసులు గురువారం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో అరెస్ట్‌ చేశారు. నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్‌సీ(ఐటీ)లో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది.

Also read : Madras HC: 30రోజుల పాటు హాస్పిటల్‌లో వార్డ్ బాయ్‌గా చేస్తానంటేనే బెయిల్

నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్‌సీ(ఐటీ)లో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరూ పట్టుబడగా..మాన్సి దంపతులు పారిపోయారు. వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి వద్ద మాన్సీని పట్టుకున్నారు.

ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగ్‌పుర్‌ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటుంటారు. భోపాల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మాన్సి ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటోంది. అలా ఓ పక్క ఐటీ ఉద్యోగం చేస్తు మరో పక్క సైడ్ బిజినెస్ గా ఇలా గంజాయి అమ్మకాల్లో ఆరితేరిపోయింది. ఈక్రమంలో పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. గత కొంతకాలంలో గంజాయి వ్యాపారం చేస్తున్న మాన్సి ఆట కట్టించామని ఏసీపీ నరేష్‌రెడ్డి తెలిపారు.

Also read : Heavy Cash Seize : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.5 కోట్లు పట్టివేత