Munugode By Poll..KA Paul Dance : మునుగోడులో కేఏ పాల్ డ్యాన్స్.. ఊరమాస్ స్టెప్పులతో ఎన్నికల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు హీట్ పుట్టిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు ఆకట్టుకోవటానికి రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ కూడా తనకు ఓటు వేయమని ఓటర్లను కోరుతూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఊరమాస్ స్టెప్ లతో పాల్ డ్యాన్స్ వేశారు.

Munugode By Poll..KA Paul Dance
Munugode By Poll..KA Paul Dance : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీలు హీట్ పుట్టిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లు ఆకట్టుకోవటానికి రకరకాల ఫీట్లు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ కూడా తనకు ఓటు వేయమని ఓటర్లను కోరుతూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. జనాల మధ్య ఏమాత్రం సిగ్గుపడకుండా ఊరమాస్ స్టెప్ లతో పాల్ డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియో తెగ వైరల్అవుతోంది. తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికాలా అభివృద్ధి చేస్తానంటూ హామీలు కురిపిస్తున్నారు. తెలంగాణ పాటలకు డ్యాన్సులు వేస్తూ ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరుతున్నారు. తెలంగాణ పాటలతో సందడి చేస్తున్నారు.
కాగా మునుగోడులో గెలుపు ప్రధాన మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు టీఆర్ఎస్ మునుగోడులో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఫీట్లు చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో జాయిన్ అయి మునుగోడుకు ఉప ఎన్నికకు కారణమై..బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ కు మునుగోడులో గెలుపు చాలా చాలా ముఖ్యం. అలాగే కాంగ్రెస్ పార్టీకు హ్యాండ్ ఇచ్చిన రాజగోపాల్ ను ఎలాగైనా ఓడించి పట్టునిలుపుకోవాలని హస్తం పార్టీ యత్నాలు అన్నీ ఇన్నీకావు. ఇలా మునుగోడులో గెలుపు ఇటు అధికార పార్టీకి..అటు బీజేపీ, కాంగ్రెస్ లకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
Munugode By Poll : గెలుపుకోసం టీఆర్ఎస్ ఫీట్లు .. దోశలు,పూరీలు వేసి ఇస్త్రీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
దీంతో ఓటర్లను ఆకట్టుకోవటానికి ఆయా పార్టీలు ఫీట్లు మొదలుపెట్టేశాయి. ఓపక్కన ధారాళంగా డబ్బు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో తనదైన శైలిలో ఫీట్లు మొదలుపెట్టేసింది.దీంట్లో భాగంగానే చండూరులో ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దోశలు వేసారు. పూరీలు వేసారు. అలాగే ఇస్త్రీ పెట్టె పట్టుకుని బట్టలు ఇస్త్రీ చేసేస్తు తెగ హడావిడి చేసారు.