TSPSC: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్

సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 1030 మందికి శిక్షణ ఇచ్చాము. జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. త్వరలో మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము. గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తాం. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయిస్తాం

TSPSC: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్

Minister Harishrao says Group-4 notification will be release soon

TSPSC: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తొందరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ కూడా ప్రారంభమైంది. ఇక మిగిలిన విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన జాబ్‌ ప్రకటనలను కూడా వెంటవెంటనే ప్రకటించనుంది. దీనిలో భాగంగా టీఎస్పీయస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 1030 మందికి శిక్షణ ఇచ్చాము. జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. త్వరలో మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము. గ్రూప్-4 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తాం. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయిస్తాం’’ అని అన్నారు. సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడి హోటల్ కూల్చివేత.. నంద కుమార్ కుటుంబ సభ్యుల అభ్యంతరం