TRT Notification : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.

TRT Notification : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy (1)

Sabitha Indra Reddy – TRT Notification : తెలంగాణలో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల అయింది. గురువారం హైదరాబాద్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ 5,089 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నామని తెలిపారు. 1,523 డిజేబుల్డ్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న టెట్ నిర్వహిస్తామని, 27న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. గురుకులాల్లో ఇప్పటికే 12 వేల పోస్టులు భర్తీ చేశామని పేర్కొన్నారు.

నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణలో నిధుల కేటాయింపు, నీటి పంపకాలు కూడా సాకారం చేసుకున్నామని తెలిపారు. అనేక నియామకాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా 15 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.

Kodandaram : ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ : కోదండరాం

విద్యా రంగానికి గత బడ్జెట్ లో రూ.9 వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గురుకులాలు పెద్ద సంఖ్యలో ఇచ్చి ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించామని చెప్పారు. గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని తెలిపారు. ఇంటర్ ఉన్నవాటిని డిగ్రీకి అప్ గ్రేడ్ చేశామని వెల్లడించారు.  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ నిధులు కేటాయిస్తామని చెప్పారు.

మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ కి ధీటుగా మెరుగు పరిచామని తెలిపారు. గురుకులాల్లో నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశామని చెప్పారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇతర విభాగాల్లో 3,096 మందిని రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.

Podem Veeraiah : భద్రాచలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాసా.. రేగా కాంతారావు మాట్లాడకుండా మైక్ లాక్కున్న పొదెం వీరయ్య

డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 8,792 పోస్టులు భర్తీ చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రమోషన్ ప్రాసెస్ మొదలు పెట్టామని.. కోర్టు కేసులతో పెండింగ్ లో ఉందన్నారు. తెలంగాణ నినాదంతో నీళ్ళు అందించామని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు.

విద్యారంగం ప్రగతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఏడాది విద్య కోసం రూ.29,611 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో 12,150 మందిని రిక్రూట్ చేసుకున్నామని తెలిపారు. రెండో విడతలో ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను సీఎం కేసీఆర్ రెగ్యులర్ చేశారని వెల్లడించారు.

Salary of ISRO Chairman : ఇస్రో చైర్మన్ సోమనాథ్ జీతం ఎంతో తెలుసా.. అలవెన్స్‌లు అన్నీ కలిపి ఎంతంటే?

టీఎస్పీఎస్సీ ద్వారా కాలేజీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. లక్షా 21 వేల టీచర్ పోస్టులకుగానూ లక్షా 3 వేల మంది టీచర్లు ఉన్నారని వెల్లడించారు. ఇప్పుడు 6 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. యూనివర్సిటీ అధ్యాపకుల నియామక బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. దీనిపై గవర్నర్ కు ఉన్న డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేశామని తెలిపారు.