MLC Kavitha: మోసం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతే.. కర్ణాటక మంత్రి వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర్ ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు.

MLC Kavitha: మోసం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతే.. కర్ణాటక మంత్రి వీడియో షేర్ చేసిన  ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha

Updated On : October 19, 2023 / 11:32 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటల యుద్ధానికి తెరలేసింది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతున్న వీడియోను ట్విటర్ లో పోస్టు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతేనంటూ కవిత పేర్కొన్నారు. మోసం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్ ఓటేస్తే కర్ణాటక గతే.. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు ఖాయం అంటూ కవిత ట్వీట్ లో తెలిపారు.

Read Also : Indrasena Reddy : త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనా రెడ్డి .. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడో నేతగా ..

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల సమయంలో 20గంటలపాటు కరెంటు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఐదు గంటల కరెంట్ తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు. కర్ణాటక మంత్రిలానే ఇక్కడ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా మూడు గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు ఇవ్వడం అనవసరమని అన్నాడు అంటూ కవిత ట్విటర్ లో పేర్కొన్నారు. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకు? ఐదు గంటలు.. మూడు గంటల పార్టీలు మనకొద్దు.. దేశంలో ఉచితంగా 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలుద్దాం అంటూ కవిత ప్రజలను కోరారు.