CM KCR Munugode Campaign : మునుగోడు ఉపఎన్నికలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, స్వయంగా బరిలోకి

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.

CM KCR Munugode Campaign : మునుగోడు ఉపఎన్నికలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, స్వయంగా బరిలోకి

CM KCR Munugode Campaign : తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు కేసీఆర్. ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక్కో నేతకు ప్రచార బాధ్యతలు అప్పగించారు కేసీఆర్.

14మంది మంత్రులు, 72మంది ఎమ్మెల్యేలు, ఎంపీల, ఎమ్మెల్సీలతో పాటు సీఎం కేసీఆర్ సైతం ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. తనకు ఒక గ్రామం బాధ్యత ఇవ్వాలని, లెంకలపల్లికి తన పేరు రాయాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్. దీంతో లెంకలపల్లి ప్రచార బాధ్యతలను కేసీఆర్ కు అప్పగించారు.

 

లెంకలపల్లి గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జిగా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సాధారణంగా ఉపఎన్నికల విషయంలో పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు కేసీఆర్ బాధ్యతలు అప్పజెబుతుంటారు. ఒక్కోసారి మంత్రి కేటీఆర్ ను కూడా పంపిస్తారు. కానీ, ఈసారి వారితో పాటు స్వయంగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగడం, ఒక గ్రామానికి ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టనుండటంతో మునుగోడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటికే మంత్రి హరీశ్ రావు మర్రిగూడెం మండలం బాధ్యతలను తీసుకున్నారు. ఆ మండలంలోని చిన్న గ్రామం అయిన లెంకలపల్లిని సీఎం కేసీఆర్ ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. లెంకలపల్లి గ్రామ జనాభా 3వేలు. అందులో 2వేల 150 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ తో పాటు పది వార్డుల్లో ఎనిమిదింటిని కాంగ్రెస్ గెల్చుకుంది. స్థానిక ఎంపీటీసీగా కూడా కాంగ్రెస్ అభ్యర్థే గెలుపొందారు. అయితే, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయి.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా స్థానిక సర్చంచ్ తో పాటు ముగ్గురు వార్డు సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుతం ఎంపీటీసీతో పాటు ఐదుగురు వార్డు సభ్యులు బీజేపీలో కొనసాగుతున్నారు. లెంకలపల్లిలో ప్రచారంతో పాటు ఈ నెలాఖరులో చెండూరులో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు సీఎం కేసీఆర్. ఈ సభకు సీపీఎం, సీపీఐ నేతలు హాజరుకానున్నారు.

గులాబీ బాసే స్వయంగా ప్రచారబరిలోకి దిగుతుండటంతో నియోజకవర్గంలో అసంతృప్త నేతలను మంత్రులు బుజ్జగిస్తున్నారు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. కూసుకుంట్లతో తమకు ఎదురైన ఇబ్బందులను అసంతృప్త నేతలు మంత్రులకు వివరించగా, అన్నింటిని మర్చిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.