Munugode Assembly Bypoll: నేడే మునుగోడు జడ్జిమెంట్.. మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా.. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలి రౌండ్లలో చౌటుప్పల్ మండలంలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్న అధికారులు చివరి మూడు రౌండ్లలో నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.

Munugode Assembly Bypoll: నేడే మునుగోడు జడ్జిమెంట్.. మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Munugode ByPoll

Munugode Assembly Bypoll: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8గంటలకు ప్రారంభమవనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు రెండు టేబుళ్లు, ఈవీఎంల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో (14పూర్తిగా, 15వ రౌండ్లో నాలుగు టేబుళ్లు) లెక్కించనున్నారు. అనంతరం డ్రా పద్దతిన అయిదు పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలలోని వీవీ స్లిప్‌లను లెక్కించి సరిచూస్తారు. మధ్యాహ్నం 3గంటలలోపు తుది ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ప్రతీరౌండ్ ఫలితాన్ని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లపై ప్రదర్శించనున్నారు.

Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‭కు సర్వం సిద్ధం.. ఉదయం 9 లోపే మొదటి ఫలితం

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా.. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లను 1,2,3,4 రౌండ్లలో లెక్కిస్తారు. సంస్థాన్ నారాయణపురం ఓట్ల లెక్కింపును 4,5,6 రౌండ్లలో లెక్కిస్తారు. అదేవిధంగా మనుగోడు మండలంలోని ఓట్లను 6,7,8 రౌండ్లలో, చండూరు మండలంలోని ఓట్లను 8, 9, 10 రౌండ్లలో, గట్టుప్పల మండలంలోని ఓట్లను 10, 11 రౌండ్లలో, మర్రిగూడ మండల పరిధిలోని ఓట్లను 11, 12, 13 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇక చివరిగా నాంపల్లి మండలంలోని ఓట్లను 13, 14, 15 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.

Munugode Counting : మునుగోడు మొనగాడెవరు? ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం, భారీ భద్రత ఏర్పాటు

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం రాత్రి వరకు  జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గంలోని 241,805 మంది ఓటర్లలో 225,192 మంది ఓటర్లు (93.13శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడు బ్లాక్‌లోని జక్కలవారిగూడెం పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా (98.21%), అత్యల్పంగా (82.62%) మర్రిగూడ బ్లాక్‌లోని దామెర భీమనపల్లిలోని పోలింగ్ స్టేషన్‌లో నమోదైంది. ఇదిలాఉంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో 91.30 శాతం పోలింగ్ నమోదైంది.