Munugode Counting : మునుగోడు మొనగాడెవరు? ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం, భారీ భద్రత ఏర్పాటు

మునుగోడు మొనగాడు ఎవరు? అనేది రేపు తేలిపోనుంది. మునుగోడు బైపోల్ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు.

Munugode Counting : మునుగోడు మొనగాడెవరు? ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధం, భారీ భద్రత ఏర్పాటు

Munugode Counting : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం రేపు రానుంది. మునుగోడు ఉపఎన్నిక రిజల్ట్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. మునుగోడు మొనగాడు ఎవరు? అనేది రేపు తేలిపోనుంది. మునుగోడు బైపోల్ కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. రేపు మధ్యాహ్నానికి మునుగోడు మొనగాడు ఎవరో తేలిపోనుంది. రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్జాలబావిలోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ కేటాయించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండగా.. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల భద్రత, కౌంటింగ్ పరిసరాల్లో 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డ్ అయ్యేలా కౌంటింగ్ పరిసరాల్లో మొత్తం 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రధాన రహదారి మొదలుకుని అన్ని వైపుల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.