Sureedu : వైఎస్‌ ముఖ్య అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు సూర్యనారాయణ రెడ్డి అలియస్ సూరీడుపై హత్యాయత్నం జరిగింది.

Sureedu : వైఎస్‌ ముఖ్య అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

Sureedu

Attack On Sureedu : దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా, సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సూర్యనారాయణ రెడ్డి అలియస్ సూరీడుపై హత్యాయత్నం జరిగింది. సొంత అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్‌తో మామపై హత్యాయత్నం చేశాడు.

సూరీడు కుమార్తె గంగా భవానీని సురేంద్రనాథ్‌ వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు భరించలేకపోయిన భవానీ పుట్టింటికి వచ్చేసింది. భర్తపై గృహ హింస కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని తన భార్య భవానీ, మామ సూరీడుపై అల్లుడు సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బెదిరింపులకు కూడా దిగాడు. వారు నిరాకరించడంతో కక్ష పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

గతేడాది(2020) కూడా ఇలానే సురేంద్రనాథ్ దాడికి పాల్పడగా సూరీడు తప్పించుకున్నాడు. ఈసారి సురేంద్రనాథ్ ఏకంగా ఇంటికే వచ్చి దాడి చేయడం కలకలం రేపుతోంది. గంగా భవానీ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు సురేంద్రనాథ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేంద్రనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.