Phone Tapping Case: కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు.. భారీగా మోహరించిన పోలీసులు
హైదరాబాద్, నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
KCR
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
- ఎర్రవెల్లి నివాసం నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్
- నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో విచారణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్, నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
అంతకుముందు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన వేళ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు చల్లారు.
Also Read: Union Budget 2026: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కినవి ఇవే..
నందినగర్‌లోని కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు 4 అంచల భద్రతను ఏర్పాటు చేశారు. విచారణ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ నివాసానికి వెళ్లే దారులను మూసివేశారు.
నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది.
