Nara Brahmani : కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! నారా బ్రాహ్మిణి ట్వీట్

బ్రాహ్మిణి ట్వీట్ ప్రకారం.. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో

Nara Brahmani : కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! నారా బ్రాహ్మిణి ట్వీట్

Nara Brahmani

Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రోజుకో రీతిలో ఆందోళనలు నిర్వహిస్తూ టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతు దారులు తమ నిరసన తెలుపుతున్నారు. తాజాగా సోమవారం ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. సోమవారం రాత్రి 7గంటల నుంచి 5 నిమిషాల పాటు ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరింది.

Read Also : Chandrababu : అంతిమ విజయం న్యాయానిదే, త్వరలోనే బయటకు వస్తా, నియంత పాల‌న‌పై పోరాటం కొన‌సాగించండి- తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే ‘ మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ వంటి కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు. తాజాగా ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో సోమవారం రాత్రి ఐదు నిమిషాలు తమ నిరసన తెలపనున్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఒక్కటిగా వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ‘సైకో పోవాలి’ అని రాసిన పత్రాలను దహనం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మిణి ఆసక్తికర ట్వీట్ చేశారు.

Read Also : Chandrababu : చంద్రబాబు లీగల్ ములాఖత్ పెంపు పిటిషన్.. ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు

బ్రాహ్మిణి ట్వీట్ ప్రకారం.. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం! అంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను షేర్ చేసింది. ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ రాసిఉంది.