Omicron Variant : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్.. దుబాయ్‌ నుంచి వచ్చిన పలువురికి వేరియంట్

జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్‌పల్లి పట్టణానికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. బాధితులను హైదరాబాద్‌లోని టిమ్స్‌కు పంపారు.

Omicron Variant : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్.. దుబాయ్‌ నుంచి వచ్చిన పలువురికి వేరియంట్

Omicron (4)

Omicron Variant in joint Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెడుతోంది. ముస్తాబాద్‌లోని గూడెం గ్రామంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు అయ్యింది. డిసెంబర్‌ 20న దుబాయ్‌ నుంచి ఓ వ్యక్తికి వేరియంట్ సోకింది. అతని కాంటాక్ట్స్‌కు టెస్టులు చేయగా.. బాధితుడి భార్య, తల్లి, స్నేహితులకు కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. ఒమిక్రాన్‌ భయంతో గ్రామస్తులు ఇప్పటికే గూడెం గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఎల్లారెడ్డి పేటలోని నారాయణపూర్ గ్రామంలోనూ యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది.

జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ నమోదు అయ్యింది. షార్జా నుంచి మెట్‌పల్లి పట్టణానికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. బాధితులను హైదరాబాద్‌లోని టిమ్స్‌కు అధికారులు తరలించారు. అటు ఒమిక్రాన్‌ భయంతో అనేక గ్రామాల్లో అధికారులు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Vaccination : దేశవ్యాప్తంగా రేపటి నుంచి పిల్లలకు టీకా

భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1525కి చేరింది. ఇక 560 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ ,తెలంగాణ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి

మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351, గుజరాత్ 136, తమిళనాడులో 117, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 67,కర్ణాటక 63,హర్యానా 63, పశ్చిమ బెంగాల్ 29, ఏపీ17, ఒడిశా 14, మధ్యప్రదేశ్ 9, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 8,చండిఘడ్ 3 జమ్మూకాశ్మీర్ 3, అండమాన్ నికోబార్ 2, గోవా 1, హిమాచల్ ప్రదేశ్ 1, లద్దాఖ్ 1,మణిపూర్ 1,పంజాబ్ 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.