Pudding And Mink Pub : ఫుడ్డింగ్ పబ్ కేసు..కీలకాంశాలివే, ఇద్దరు పరార్

అక్కడంతా హైటెక్ వ్యవహారం సాగుతోంది. పోలీసుల విచారణలో.. పబ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో FIR నమోదు చేశారు...

Pudding And Mink Pub : ఫుడ్డింగ్ పబ్ కేసు..కీలకాంశాలివే, ఇద్దరు పరార్

Hyd Drug Case

Pudding And Mink Pub : హైదరాబాద్‌లో పబ్‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున.. అది కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. కిక్కిచ్చే లిక్కర్‌తో పాటు తిక్క రేపే డ్రగ్స్‌ దొరకడం షాక్‌కు గురిచేస్తోంది. రాడిసన్‌ హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లో షుగర్‌ క్యాండీలతో పాటే కొకైన్‌ ప్యాకెట్ల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. బయటకు పబ్‌లా కనిపించినా.. అక్కడంతా హైటెక్ వ్యవహారం సాగుతోంది. పోలీసుల విచారణలో.. పబ్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో FIR నమోదు చేశారు.

Read More : Hyd Pubs : పక్కా ప్లాన్‌‌తో పబ్‌‌పై దాడులు.. వారం పాటు టాస్క్‌‌ఫోర్స్ రెక్కీ

క్రైమ్ నంబర్ 226/2022 u/S 8©️, 22(b),29(1) of NDPS చట్టం 1985 కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ హఫీజుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో పుడ్డింగ్ & మింక్ పబ్ పై పోలీసులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. హోటల్ 1వ అంతస్తులో ఉన్న పబ్‌కి తెల్లవారు జామున 02.00 గంటలకు వెళ్లి దాడులు జరిపారు. మహదరం అనిల్ కుమార్, అభిషేక్ వుప్పాల, అర్జున్ వీరమాచినేని (పరారీ), కిరణ్ రాజు (పరారీ)
వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అనీల్ కుమార్, అభిషేక్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Read More : Hyd Drugs Case : ఆ లిస్టు తప్పు.. అసలు లెక్క మా దగ్గర ఉంది.. 5 ప్యాకెట్ల కొకైన్ సీజ్

ఇక పబ్ నుంచి S-1 బరువు 1 గ్రాము, S-2 బరువు 0.64 గ్రాములు, S-3 బరువు 0.93 గ్రాములు, S-4 1 గ్రాము, S-5 బరువు 1.07 గ్రాములు (మొత్తం – 4.64 గ్రాములు) కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. బార్ కౌంటర్ నుండి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్‌తో పాటు రెండు కేడీ (ప్లాస్టిక్ ట్రే)లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే DI Samsung Galaxy S22 Ultra Model No.SM-S908E/DS IMEI నం.358624670059471, Apple iPad 5మోడల్ ఫోన్, ల్యాప్‌టాప్, మినీ-ప్రింటర్, వెయింగ్ మెషీన్, ప్యాకింగ్ మెటీరియల్‌, 216సిగిరెట్ పీకలు సైతం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడులు జరిపిన సమయంలో అనీల్ కుమార్ అక్కడే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.