Hyd Pubs : పక్కా ప్లాన్‌‌తో పబ్‌‌పై దాడులు.. వారం పాటు టాస్క్‌‌ఫోర్స్ రెక్కీ

వారం రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు పబ్ కు వెళ్లారు. పబ్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా గమనించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు...

Hyd Pubs : పక్కా ప్లాన్‌‌తో పబ్‌‌పై దాడులు.. వారం పాటు టాస్క్‌‌ఫోర్స్ రెక్కీ

Birth Day Drug

Pudding And Mink pub : బంజారాహిల్స్‌ రాడిసన్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో.. పోలీసుల యాక్షన్‌ షురూ అయింది. పబ్‌లో డ్రగ్స్ వెలుగుచూడడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లోనే ఈ తతంగమంతా జరగడంతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డ్రగ్స్ ఘటన కలకలం రేపిన కాసేపటికే బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేసిన హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌.. ఏసీపీకి మెమో జారీ చేశారు. బంజారాహిల్స్‌ కొత్త సీఐగా నాగేశ్వర్‌రావును నియమించారు. ఈ కేసులో అభిషేక్‌, అనిల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై కేసులు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. పక్కా ప్లాన్ తో పబ్ పై దాడులు జరిపారు. వారం రోజుల నుంచి పోలీసులు రెక్కీ నిర్వహించారు.

Read More : Pudding and Mink Pub: పబ్ లో డ్రగ్స్ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు: డ్రగ్స్ కోసం ఏకంగా “స్మార్ట్ యాప్”

ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ తో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు పరిచయం పెంచుకున్నారు. కానిస్టేబుల్స్ కి పబ్ లో పార్టీ ఇన్విటేషన్ కోడ్ ను రెగ్యులర్ కస్టమర్స్ షేర్ చేశారు. వారం రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు పబ్ కు వెళ్లారు. పబ్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా గమనించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అనంతరం 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు జరిపారు. ఈ దాడులపై డీసీపీ జోయల్ డెవిస్ మీడియాతో మాట్లాడారు. రైడ్‌ చేసిన సమయంలో పబ్‌లో 148 మంది ఉన్నారని.. పబ్‌ మేనేజర్‌ వద్ద 5 ప్యాకెట్ల కొకైన్‌ దొరికిందని చెప్పారు.

Read More : Pudding And Mink Pub : ఆ పబ్‌‌లో కోడ్ చెబితేనే ఎంట్రీ.. స్పెషల్ ట్రీట్‌‌మెంట్

పబ్‌తో డ్రగ్స్‌ లింక్స్‌పై ఫోకస్‌ పెట్టామని.. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నామని చెప్పారు డీసీపీ. ఇక.. పబ్‌లో పట్టుబడిన డ్రగ్స్ ఎక్కడిది..? ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరూ సరఫరా చేశారు..? కస్టమర్స్ ఎవరెవరు వినియోగిస్తున్నారు? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. అయితే పబ్‌ మేనేజర్‌ మాత్రం అసలు నోరు విప్పడం లేదని పోలీసులు చెప్తున్నారు. అటు.. పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌కు గోవా లింకులు ఇంకా బయటపడలేదంటున్నారు పోలీసులు. అయితే కస్టమర్స్‌ డ్రగ్స్‌ వినియోగించారా? లేదా? ఎవరెవరు తీసుకున్నారు? అనేది తేలాల్సి ఉందని పోలీసులంటున్నారు.