Pudding And Mink Pub : ఆ పబ్‌‌లో కోడ్ చెబితేనే ఎంట్రీ.. స్పెషల్ ట్రీట్‌‌మెంట్

ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంతా హైటెక్ పద్ధతిలో సాగిపోతుంది. డ్రగ్స్ పార్టీ జరిగిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు సంబంధించి విచారణలో సంచలన విషయాలు...

Pudding And Mink Pub : ఆ పబ్‌‌లో కోడ్ చెబితేనే ఎంట్రీ.. స్పెషల్ ట్రీట్‌‌మెంట్

Birth Day Drug

Special Code In Pudding And Mink Pub : బయటకు చూస్తే అది పబ్ మాత్రమే. కానీ ఆంతా హైటెక్ వ్యవహారం సాగుతోంది. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంతా హైటెక్ పద్ధతిలో సాగిపోతుంది. డ్రగ్స్ పార్టీ జరిగిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు సంబంధించి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్‌లోకి వెళ్లాలంటే కోడ్ కంపల్సరీ అని తేలింది. యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్లకు కోడ్ పంపిస్తున్న నిర్వాహకులు.. అది చెబితేనే ఎంట్రీ ఇస్తున్నారు. బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్‌ (Pudding And Mink) పబ్‌కు వెళ్లాలంటే సీక్రెడ్ కోడ్ తప్పనిసరి. అందులోనూ అందరిని పబ్‌లోనికి అనుమతివ్వరు. యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని… ఓటీపీ (OTP) వచ్చిన తర్వాత పబ్‌ (PUB) లోకి ఎంట్రీ అయ్యే సమయంలో కోడ్ ఎంటర్‌ చేస్తేనే నిర్వాహకులు అనుమతిస్తున్నారని వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్ డెవిస్‌ తెలిపారు. యాప్‌ ద్వారా ఈ తతంగమంతా నడుస్తోందన్నారు.

Read More : Hyd Drugs Case : నిందితులకు రిమాండ్.. నా కొడుకు నిరపరాధి అభిషేక్ తల్లి

పుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లో 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్ డెవిస్. రైడ్ చేసిన సమయంలో పబ్‌లో మొత్తం 148 మంది ఉన్నారని చెప్పారు. బార్‌ కౌంటర్‌లో కూడా డ్రగ్స్ ఉంచి సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొకైన్‌ను డ్రింక్‌లో వేసుకుని తాగినట్లు గుర్తించామని చెప్పారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఎవరు సరఫరా చేస్తున్నామో ఆరా తీస్తున్నామన్నారు డీసీపీ జోయల్ డెవిస్. తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. హైదరాబాద్‌ సిటీలో వరుసగా బయటపడుతున్న డ్రగ్స్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రగ్స్ దందాపై ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా వర్కౌట్ చేస్తుండగా.. ఇంతలోనే హైదరాబాద్‌ నడిబొడ్డున పబ్‌లో డ్రగ్స్‌ పార్టీ జరగడం కలకలం రేపింది. వీవీఐపీల పిల్లలు, సెలెబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొనడం షాక్‌కు గురి చేసింది. డ్రగ్స్‌ తీసుకుంటూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది.

Read More : Hyd Drugs Case : ఆ లిస్టు తప్పు.. అసలు లెక్క మా దగ్గర ఉంది.. 5 ప్యాకెట్ల కొకైన్ సీజ్

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరిని విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడిది..? మీకు ఎవరూ సరఫరా చేశారు..? అన్న దానిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూపీ లాగుతున్నారు. అరెస్టైన వారిలో పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌, ఈవెంట్ మేనేజర్ అనిల్ ఉన్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు హైదరాబాద్‌ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏసీపీ నర్సింగరావు, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనాథ్ రంగంలోకి దిగి కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు… డ్రగ్స్ కలకలంపై హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్‌ పోలీసు అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు.. డిటెక్టివ్‌ ఇన్స్‌పెక్టర్లను రిపోర్ట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.