Pudding And Mink : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌.. లోపల జరిగేదే వేరు, బట్టబయలైన నిజస్వరూపం

బంజారాహిల్స్‌ రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమార్తె నిర్వహిస్తున్నారు. గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పబ్ నిర్వహకురాలు...

Pudding And Mink : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌.. లోపల జరిగేదే వేరు, బట్టబయలైన నిజస్వరూపం

Radisson Pub

Pudding And Mink Pub : పేరుకేమో ఆయుర్వేదిక్‌ బార్‌..! ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయుర్వేదిక్‌ బార్‌గా బిల్డప్‌..! లోపల జరిగేదంతా వేరు…! ఆయుర్వేదిక్‌ కాక్‌టైల్స్‌కు కేరాఫ్‌ అంటూ ప్రచారం చేసుకునే పూడింగ్‌ అండ్‌ మింక్‌ బార్‌ నిజస్వరూపం బయటపడింది. కాక్‌టైsల్స్‌ మాటున హైదరాబాద్‌ను నిషాలో ముంచెత్తుతోంది. ఆయుర్వేదిక్‌ కాక్‌టైల్స్‌తో హ్యాంగ్‌ ఓవర్‌ అసలు ఉండనే ఉండదంటూ ఇన్నాళ్లు ప్రచారంలో మునిగితేలిన ఈ బార్‌ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయి. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ను మాజీ ఎంపీ కూతురు స్థాపించారు. తమ బార్‌కు వచ్చే వారి బాడి టైప్‌కు తగ్గట్లు డ్రింక్స్‌ సప్లై చేయడం తమ ప్రత్యేకతంటూ ఇంటర్వ్యూలు ఇచ్చారు.

Read More : Banjarahills Police : బంజారాహిల్స్ పీఎస్‌‌కు కొత్త సీఐ.. ఈయన ఎవరు ?

బంజారాహిల్స్‌ రాడిసన్ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌ను ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కుమార్తె నిర్వహిస్తున్నారు. గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పబ్ నిర్వహకురాలు తేజస్విని చౌదరి ఇంటర్వూ ఇచ్చారు. ఇందులో పబ్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తమ పబ్‌ ఆయుర్వేదిక్ కాక్‌టైల్స్‌కు కేరాఫ్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నో హ్యాంగోవర్ డ్రింగ్స్ సర్వ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఏ క్లాస్ కస్టమర్ల కోసమే స్పెషల్‌గా నడిచే పబ్ అంటూ పుడ్డింగ్ అండ్ మింక్‌ గురించి ఆమె చెప్పారు. పైకి ఆమె అలా చెప్పినా.. లోపల మాత్రం మొత్తం రివర్స్‌ నడుస్తోంది.

Read More : Drug Case : ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు డ్రగ్స్ తీసుకున్నాడా ? ఆ 8 మంది ఎవరు ?

ఆయుర్వేదిక్‌ కాక్‌టైల్స్‌ మాటున డ్రగ్స్‌ అమ్ముతున్నారు ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులు. హ్యాంగోవర్‌ ఉండనే ఉండదని చెప్పి.. కిక్కు తలకెక్కే కొకైన్‌ను సప్లై చేస్తున్నారు.
మరోవైపు..బంజారాహిల్స్‌ డ్రగ్స్‌ కేసులో కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీల వారసులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఆ జాబితాను పోలీసులు విడుదల చేశారు. అందులో 142మంది పేర్లున్నాయి. ఇందులో 11వ పేరు గల్లా సిద్ధార్ధ్‌గా ఉంది. ఆయన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రెండో కుమారుడు. ప్రముఖ హీరో మహేశ్‌బాబు మేనల్లుడు కూడా. గల్లా సిద్ధార్ధ్‌ అన్న గల్లా అశోక్‌ ఇటీవలే హీరోగా పరిచయమయ్యారు. అన్న హీరోగా పరిచయం అయితే తమ్ముడు ఇప్పుడు డ్రగ్‌ కేసులో దొరికిపోయాడు. పోలీసుల దాడిలో ఉదయం గల్లా అశోక్‌ పేరు వచ్చింది. ఆ వెంటనే గల్లా ఫ్యామీలీ స్పందించింది. నిరాధార వార్తలు ప్రసారం చేయవద్దంటూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు అనూహ్యంగా గల్లా సిద్ధార్ధ్‌ పేరు జాబితాలో ఉంది.