Narendra Modi Comments : ఫిర్ ఎక్ బార్.. మోదీ సర్కార్.. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలి : ప్రధాని మోదీ

Narendra Modi Comments : వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణం. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు.

Narendra Modi Comments : ఫిర్ ఎక్ బార్.. మోదీ సర్కార్.. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలి : ప్రధాని మోదీ

PM Narendra Modi Comments ( Image Credit : Google )

Narendra Modi Comments : ఎన్డీఏ విజయం మొదటి మూడు విడతల్లోనే తేలిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ సీట్లు వెతుక్కోవడానికి మైక్రోస్కోప్ కావాలని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓరుగల్లు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారికి, రామప్ప శివుడికి దండం పెట్టుకుని మరి మోదీ తన ప్రసంగానికి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఓరుగల్లు ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశం దృష్టశక్తుల చేతుల్లోకి వెళ్లొద్దు.. మళ్లీ బీజేపీనే రావాలి :
వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణమని అన్నారు. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు. ప్రపంచమంతా అనేక విపత్తులు ఎదుర్కుంటుందని అన్నారు. దేశం దృష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని చెప్పారు.

10ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఎలాంటి పాపాలు చేసిందో ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభ కోణాలు.. బాంబు బ్లాస్టింగ్స్ జరిగాయని ఆరోపించారు. కూటమి ఐదేళ్లలో ఐదుగురు ఐదుగురు ప్రధాన మంత్రులు అయ్యారన్న మోదీ ఈ దేశాన్ని ఇలాంటి వారి చేతుల్లో పెడదామా? అని ప్రశ్నించారు.

పార్టీకో ప్రధాని.. ఏడాదికో ప్రధాని ఉంటే.. :
ప్రతి పార్టీకి ఒక ప్రధాన మంత్రి.. ఏడాదికో ప్రధాని చొప్పున ఉంటే ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుందనని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే రుణమాఫీ వట్టి మాటేనని తేలిపోయిందన్నారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న కాంగ్రెస్ నాయకులు దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విశ్వాసఘాతక పార్టీ అంటూ ధ్వజమెత్తారు.

తెలంగాణలో విద్యుత్ కోతలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది.. సర్కారు ఖజానా ఖాళీ అయింది.. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట తెలంగాణ ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒక భాగం ఢిల్లీకి వెళ్తుందని, కాంగ్రెస్ నేతల ఇళ్లలో నోట్ల కట్టలు బయడపడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదన్నారు.

ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే :
చట్టాన్ని సవరించైనా సరే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తుందని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. దళితుడు రామ్‌నాథ్ కొవిద్‌ను రెండోసారి ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అమానించిందన్నారు.

ఆమెను ఆఫ్రికన్‌గా భావించి కాంగ్రెస్ వ్యతిరేకించిందని మండిపడ్డారు. నల్లగా ఉన్నవారందరినీ కాంగ్రెస్ అవమానించినట్టేనని అన్నారు. చర్మరంగును బట్టి మనిషి గొప్పతనాన్ని నిర్ధారిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. చర్మరంగును బట్టి దేశ ప్రతిష్టను బగ్నం చేస్తే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూఠీ చేస్తే.. బీఆర్ఎస్‌ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు.