Ramagundam Constituency: లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతున్న రామగుండం రాజకీయాలు!

రామగుండం రాజకీయాలే అంత. ఎప్పుడూ.. లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతూ ఉంటాయ్. దేశంలో.. రాష్ట్రంలో.. పొలిటికల్ పార్టీల హవా కొనసాగినా.. ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు.

Ramagundam Constituency: లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతున్న రామగుండం రాజకీయాలు!

Ramagundam Assembly Constituency: మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండం రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయ్. రాజకీయ పార్టీల హవా కొనసాగుతున్నా.. స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తూ.. విలక్షణమైన తీర్పునిస్తుంటారు ఇక్కడి ఓటర్లు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబల్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోరుకుంటి చందర్.. తిరిగి సొంతగూటికి చేరారు. ఆయన ఎంట్రీతో.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎగ్జిట్ అయ్యారు. మరి.. రాబోయే ఎన్నికల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారనేదే.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ని రెబల్స్ టెన్షన్ వెంటాడుతోంది. ఇది.. ఒక్క అధికార పార్టీలోనే కాదు.. విపక్షాల్లోనూ ఆశావహులు టికెట్ కోసం లాబీయింగ్ మొదలుపెట్టేశారు. ఈ పరిస్థితుల్లో.. ఈసారి రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనిపించబోయే
పొలిటికల్ పిక్చర్ ఏంటి?

Somarapu, Korukanti, Makkan Singh

సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్, మక్కాన్ సింగ్

రామగుండం రాజకీయాలే అంత. ఎప్పుడూ.. లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతూ ఉంటాయ్. దేశంలో.. రాష్ట్రంలో.. పొలిటికల్ పార్టీల హవా కొనసాగినా.. ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు. ఇక్కడి ఓటర్లు కూడా విలక్షణమైన తీర్పులిస్తుంటారు. అయ్యో పాపం అనే సానుభూతి సంపాదించుకుంటే చాలు.. చాలా సులువుగా గెలిచేయొచ్చు. అలా.. సింపతీతో ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా.. అలా గెలిచిన నాయకుడే. రామగుండంలో ఓటర్లను డబ్బు ప్రభావితం చేయదు అని చెప్పడానికి.. కోరుకంటి ఎన్నికే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల గెలుపోటములను.. కార్మికులు, వారి కుటుంబాలే డిసెడ్ చేస్తుంటాయ్. వాళ్లను ప్రసన్నం చేసుకుంటే చాలు.. ప్రజాప్రతినిధిగా గెలిచేయొచ్చని చెబుతుంటారు.

2009లో రామగుండం నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. వాటిలో ప్రధానంగా సింగరేణి, ఎన్టీపీసీ, రామగుండం ఎరువుల కర్మాగారం, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, టీఎస్ జెన్‌కో
ఉన్నాయి. నియోజకవర్గంలో.. రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలు ఉన్నాయి. మొత్తంగా రామగుండం సెగ్మెంట్ పరిధిలో.. 2 లక్షల 4 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఇక్కడి ఓటర్లు. తర్వాత.. 2014లో జరిగిన ఎన్నికల్లో.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS Party) సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడంతో.. రెబల్‌ అభ్యర్థిగా.. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (All India Forward Bloc Party) నుంచి కోరుకంటి చందర్‌(Korukanti Chander) పోటీ చేశారు. ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 26 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత.. మారిన రాజకీయ పరిస్థితులతో.. సోమారపు కారు పార్టీని వీడారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్‌లో చేరి.. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Korukanti Chander
రాబోయే ఎన్నికల్లో.. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో.. టీఆర్ఎస్ రెబల్‌గా.. ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్(Korukanti Chander).. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు.. ఆయన బీఆర్ఎస్‌తోనే కొనసాగుతున్నారు. పైగా.. గులాబీ దళపతి కేసీఆర్ సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తాననే హామీ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేయడం కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఫార్వార్డ్ బ్లాక్ నుంచి.. మిగతా పార్టీలకు చెందిన రెబల్స్ పోటీ పడే అవకాశాలున్నాయి. పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత రాజిరెడ్డి (Raji Reddy).. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా.. వెనుకబడిన రామగుండాన్ని తానే అభివృద్ధి చేశానంటున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. తన హయాంలోనే.. మెడికల్ కాలేజీ వచ్చిందని.. అదే విధంగా ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణన్ని త్వరలోనే ప్రారంభిస్తామంటున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీరు అందించేందుకు.. సింగరేణి సహకారంలో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కూడా చేస్తామని చెప్పారు. సింగరేణి చరిత్రను తెలియజేసేలా.. తన హయాంలోనే సింగరేణి గనులను పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు కోరుకంటిటి చందర్.

Somarapu Satyanarayana
బీజేపీ నుంచి సోమారపు
 

రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (Somarapu Satyanarayana).. బీజేపీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయనతో పాటు గత ఎన్నికల్లో కాషాయం పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ హరి కూడా టికెట్ రేసులో ఉన్నారు. అయితే.. బీజేపీలో.. సోమారపుని కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం సాగుతోంది. దాంతో.. ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు.. ఆయన ఇండిపెండెంట్‌గానూ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు సన్నిహితులు. అయితే.. రామగుండంలో జరిగిన అభివృద్ధి తన హయాంలో జరిగిందే అంటున్నారు సోమారపు సత్యనారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తాను తెచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరిగిందని.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు.

Also Read: నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిని ఢీకొట్టేదెవరు.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వారేనా?

Raj Thakur Makkan Singh
ఇక.. కాంగ్రెస్ నుంచి 3 సార్లు పోటీ చేసి ఓటమిపాలైన మాజీ శాప్ ఛైర్మన్ మక్కాన్ సింగ్.. మరోసారి హస్తం పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. మక్కాన్‌ సింగ్‌కు టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. రామగుండంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. మక్కాన్ సింగ్ (Raj Thakur Makkan Singh) చెబుతున్నారు. ఈసారి.. కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కాక రేపుతోన్న కొల్లాపూర్ రాజకీయాలు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూపల్లి

రామగుండం నియోజకవర్గంలో.. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే త్రిముఖ పోరు నెలకొనే అవకాశముంది. అయితే.. అభ్యర్థులు మారతారా? గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే.. మళ్లీ ప్రత్యర్థులుగా బరిలో దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరో విషయం ఏమిటంటే.. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది. దాంతో.. ఓట్ బ్యాంక్ చీలిపోతుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా.. ఈసారి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ(All India Forward Bloc Party) నుంచి పోటీ చేసే అభ్యర్థి కూడా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. నియోజకవర్గంలో ఆ పార్టీ గుర్తు అయిన సింహం.. అందరికీ బాగా తెలుసు. దాంతో.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు చీలతాయనే అంచనాలున్నాయి. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.. బీజేపీ నుంచి పోటీ చేస్తారా? పార్టీ మారతారా? అనేది కూడా ఆసక్తి రేపుతోంది. ఓవరాల్‌గా ఈసారి రామగుండం రాజకీయాల్లో ఎలాంటి సీన్ కనిపించబోతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.