Revanth Reddy : చేతి గుర్తు మా చిహ్నం, చేసి చూపించటమే మా నైజం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కారు కూతలు..జుటా మాటలు అంటూ వినూత్నంగా వ్యాఖ్యానించారు.

Revanth Reddy : చేతి గుర్తు మా చిహ్నం, చేసి చూపించటమే మా నైజం : రేవంత్ రెడ్డి

Revanth reddy

Revanth Reddy – TPCC : తెలంగాణలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న టీ పీపీసీ చీఫ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించటమే మా నైజం అంటూ కవితా వెల్లువను కురిపించారు.

చేతి గుర్తు మా చిహ్నం.
చేసి చూపించడమే మా నైజం.

ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.

‘కారు’కూతలు రావు
‘జుటా’ మాటలు లేవు

మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..

వస్తున్నాం తెలంగాణలోనూ ..
అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను..
మోసుకొస్తున్నాం చిరునవ్వులను..

జై కాంగ్రెస్!! జై తెలంగాణ!!

కాగా తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించి గెలుపు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. కానీ నేతల మధ్య ఉండే విభేధాలు సీట్ల ఎంపిక కేటాయింపుల విషయంలో మరోసారి వ్యక్తమవుతున్నాయి. దీంట్లో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వార్ జోరుగా నడుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తుల వడపోత చేపట్టడంతో కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ(పీఈసీ) ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ్వాదానికి దారి తీసింది. ఒకే కుటంబానికి రెండు టికెట్లు ఇచ్చేఅంశంపై అధిష్టానంతో చర్చించాలని ఉత్తమ్ అడగ్గా, తనను డిక్టేట్ చేయొద్దంటూ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్ మీటింగ్ మధ్యలో నుంచే వెళ్లి పోయారు. ఈ వాగ్వాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది.