Hyd Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు నిందితుడు.. పోలీస్ అధికారి కొడుకు..?
హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితుడు లక్ష్మీపతి.. ఓ పోలీసు అధికారి సుపుత్రుడని తెలుస్తోంది.

Hyderabad Drugs
Hyd Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితుడు లక్ష్మీపతి.. ఓ పోలీసు అధికారి సుపుత్రుడని.. గతంలోనూ ఇలాంటి వ్యవహారాల్లో లక్ష్మీపతి చిక్కాడని విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
ఇప్పటివరకూ అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. “గోవా నుంచి హైదరాబాద్ కు లక్ష్మీపతి డ్రగ్స్ తరలించేవాడు. ఇంజినీరింగ్ చదివే సమయంలోనే అతను.. మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. అప్పటి నుంచే గోవాలో ఉన్న డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ కు మత్తు పదార్థాలు తెప్పించి.. బీటెక్ విద్యార్థులకు అందించేవాడు. ఇలా.. 3 సార్లు ఇప్పటికే లక్ష్మీపతి పోలీసులకు పట్టుబడ్డాడు” అని తెలుస్తోంది.
Read More: Drugs Caught in City: డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి: హైదరాబాద్ లోనే మొదటి కేసు నమోదు
ఈ విషయంపై.. పోలీసు అధికారులు కూడా షాక్ తిన్నట్టు సమాచారం. దీంతో.. అసలు లక్ష్మీపతికి లింక్స్ ఎక్కడెక్కడున్నాయి.. ఇప్పుడు అందిన సమాచారంలో వాస్తవమెంత.. ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రగ్స్ సరఫరా చేసేవాడు.. అతనికి ఇంత నెట్ వర్క్ ఎలా సాధ్యమైంది.. దానివల్ల ఎలాంటి పర్యవసనాలు తలెత్తాయి.. అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే.. ఓ ప్రైవేట్ ఉద్యోగితో పాటు.. గిటార్ ప్లేయర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న హైదరాబాద్ ఖాకీలు.. పూర్తి స్థాయి కచ్చితమైన విషయాలు బయటపెట్టే దిశగా విచారణను ముమ్మరం చేస్తున్నారు.
Read More: Drugs: హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు