Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మూడవసారి ఈడీ (Enforcement Directorate)విచారణకు హాజరయ్యారు. కవిత పాత ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత ..ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో..తన పాత ఫోన్ల గురించి అడగటం వాటిని స్వాధీనం చేసుకోవటం అంటే మహిళ స్వేచ్చకు భంగం కలిగించినట్లే అంటూ పేర్కొన్నారు.

Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

letter of MLC Kavitha to ED investigation officer Jogendra

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మూడవసారి ఈడీ (Enforcement Directorate)విచారణకు హాజరయ్యారు. గతంలో కవిత ఈడీ విచారణకు హాజరైన సమయంలో అధికారులు 2021-22 మధ్య దాదాపు 10 ఫోన్లను వినియోగించారు..వాటిని ధ్వంసం చేశారు అంటూ ఆరోపించారు. ఈడీ విచారణలో భాగంగా కవితను ప్రస్తుతం మీరు వినియోగించే ఫోన్ ఎక్కడ? అని అడిగి ఆ ఫోన్ ను తెప్పించుకున్న ఈడీ అధికారులు ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ 10 ఫోన్లును తమకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులు కవితకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎందుకంటే మూడవసారి ఈడీ విచారణకు హాజరవుతున్న కవీత ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే సమయంలో తన రెండు చేతులు ఎత్తి తన ఫోన్లను చూపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదన్న సంకేతాన్ని ఇచ్చారు. “ఇవిగో ఫోన్లు.. నేనెక్కడ ధ్వంసం చేశా?” అన్నట్లుగా ఆమె వ్యవహరించారు. ఫోన్లు చూపిస్తూ..నేను వినియోగించిన అన్ని ఫోన్లను ఈడీకి ఇస్తున్నా అంటూ తెలిపారు.

MLC Kavitha: ఈడీ విచారణకు వెళ్తుండగా ఆసక్తికర పరిణామం.. రెండు చేతులు ఎత్తి 2 సార్లు ఫోన్లు చూపించిన కవిత

MLC Kavitha Phones

తాను ఫోన్లు ధ్వంసం చేశానని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ  కల్వకుంట్ల కవిత.. ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర (ED investigation officer Jogendra)కు సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో..తన పాత ఫోన్ల గురించి అడగటం వాటిని స్వాధీనం చేసుకోవటం అంటే మహిళ స్వేచ్చకు భంగం కలిగించినట్లే అంటూ పేర్కొన్నారు. మహిళ స్వేచ్చకు భంగం కలిగించే విధంగా ఈడీ అధికారులు నా ఫోన్లను అడిగారని.. ఈడీ నా పట్ల దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను అని స్పష్టం చేశారు. ఒక మహిళ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించటం కాదు. ఆమె గోప్యత హక్కుకు భంగం కలగదా? అని ప్రశ్నించారు.

దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని ఆరోపించటం సరికాదని..నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది? అంటూ ప్రశ్నించారు. నన్ను మొదటిసారి గత మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనన్నారు.

MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ.. రేపు మరోసారి విచారణకు పిలిచిన ఈడీ అధికారులు

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారని ఇది ఈడీ నా రాజకీయ జీవితంపై చేసిన ఆరోపణలు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.