Woman Dies In Lift Accident : హాస్పిటల్‌లో షాకింగ్ డెత్.. మహిళ ప్రాణం తీసిన లిఫ్ట్.. అసలేం జరిగిందంటే

ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. ఆసుపత్రిలోని లిఫ్ట్‌ గుంతలో పడిపోయి ఆమె మరణించింది.

Woman Dies In Lift Accident : హాస్పిటల్‌లో షాకింగ్ డెత్.. మహిళ ప్రాణం తీసిన లిఫ్ట్.. అసలేం జరిగిందంటే

Woman Dies In Lift Accident : ఖమ్మం జిల్లాలోని తెలంగాణ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. ఆసుపత్రిలోని లిఫ్ట్‌ గుంతలో పడిపోయి ఆమె మరణించింది. వైరా మండలం గొల్లెనపహాడ్‌కు చెందిన ప్రమీల అనే మహిళ ఖమ్మంలోని తెలంగాణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లింది. పరామర్శ తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో లిఫ్ట్ కోసం ఆగింది. కాసేపు లిఫ్ట్ ముందు నిలబడింది.

లిఫ్ట్ ఫ్లోర్‌లోకి వచ్చేందుకు ప్రమీల బటన్ ప్రెస్ చేసింది. అయితే లిఫ్ట్ వచ్చిందేమోనని భావించిన ప్రమీల లిఫ్ట్ పూర్తిగా రాకముందే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. చూసుకోకుండా కాలేసింది. అంతే.. ఘోరం జరిగిపోయింది. ప్రమీల లిప్ట్‌ గుంతలో అమాంతం పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రమీల తీవ్రంగా గాయపడింది. ఆమెకు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ప్రమీల మరణించింది. లిఫ్ట్ కోసం వేచి ఉన్న సమయంలో ప్రమీలకు ఫోన్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూ ఆమె లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయడం, కాలు పెట్టడం, అమాంతం కిండ పడిపోవడం.. అన్నీ క్షణాల్లోనే జరిగిపోయాయి.

ఈ ఘటన ఆసుపత్రిలోని పేషెంట్లను, సిబ్బందిని షాక్ కి గురి చేసింది. తమ కళ్లెదుటే ఓ నిండు ప్రాణం పోవడం చూసి తట్టుకోలేకపోయారు. కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో విషాదం అలుముకుంది. ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించడానికి వచ్చి.. లిఫ్ట్ ప్రమాదంలో ప్రమీల మరణించడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Teacher Dies In Lift : స్కూల్‌లో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

పూర్తిగా లిఫ్ట్ తెరుచుకోకముందే.. చూసుకోకుండా డోర్ ఓపెన్ చేసి కాలు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. సహజంగా లిఫ్ట్ పూర్తిగా రాకముందు లిఫ్ట్ డోరు తెరుచుకోదు. కానీ అక్కడ లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతోనే ప్రమీల లిఫ్ట్ వచ్చిందని భావించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఇక ప్రమీల లిఫ్ట్ డోర్ ఓపెన్ చెయ్యటం, ఆపై ఆమె లిఫ్ట్ లో పడిపోవటం దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

ఈ ఘటనపై ప్రమీల కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లిఫ్ట్ ల వద్ద ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా సెక్యూరిటీని పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు చాలా చోట్ల ఇప్పటికే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో.. లిఫ్ట్‌ ఎక్కేటప్పుడైనా, దిగేటప్పుడైనా అప్రమత్తతతో ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తొందరపాటు, ఏమరపాటు అస్సలు పనికి రాదు. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా ప్రాణాలకే ప్రమాదం. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. లిఫ్ట్ వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లిఫ్ట్ రాకముందే అజాగ్రత్తగా డోర్ తెరవడం, చూసుకోకుండా కాలు పెట్టడం వంటికి అస్సలు చేయకూడదని అంటున్నారు. ఇక పిల్లలతో వచ్చే వారు.. లిఫ్ట్ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Ahmedabad : 7వ అంతస్థు నుంచి కుప్పకూలిన లిఫ్ట్ .. ఎనిమిదిమంది దుర్మరణం

కాగా.. ఇటీవలి కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. లిఫ్ట్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నిత్యం ఎక్కడో ఒక చోట లిఫ్ట్ యాక్సిడెంట్లు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే ఓ స్కూల్ లో ఘోరం జరిగింది. లిఫ్ట్ లో ఇరుక్కుని ఓ టీచర్ మరణించింది.

 

అయ్యో పాపం.. ప్రాణం తీసిన లిఫ్ట్..

 

Teacher Dies In Lift : స్కూల్‌లో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

ముంబై మలడ్ ప్రాంతంలోని ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘోరం జరిగింది. 26ఏళ్ల ఫెర్నాండెజ్.. మలడ్ వెస్ట్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా చేస్తున్నారు. ఆరో ఫ్లోర్‌లో మధ్యాహ్నం 1 గంటకు ఆమె తన క్లాస్ పూర్తి చేసుకున్నారు. రెండో ఫ్లోర్‌లోని టీచర్స్ రూమ్‌కు వెళ్లడానికి బయల్దేరారు. ఇందుకోసం లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ బటన్ నొక్కారు. ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగింది. ఆమె అందులోకి ప్రవేశిస్తుండగానే లిఫ్ట్ డోర్లు క్లోజ్ అయ్యాయి. పైన ఉన్న ఏడో అంతస్తుకు లిఫ్ట్ కదిలింది. దీంతో లిఫ్ట్‌ డోర్‌ బయట శరీరం, లోపల కాలు ఉండిపోయి.. ఆ లిఫ్ట్‌, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ టీచర్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.