Teacher Dies In Lift : స్కూల్‌లో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

స్కూల్ లిఫ్ట్ ఓ టీచర్ ప్రాణం తీసింది. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఉపాధ్యాయురాలు మరణించింది. ముంబైలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Teacher Dies In Lift : స్కూల్‌లో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి

Teacher Dies In Lift : స్కూల్ లిఫ్ట్ ఓ టీచర్ ప్రాణం తీసింది. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఉపాధ్యాయురాలు మరణించింది. ముంబైలో ఈ విషాదం చోటు చేసుకుంది. మలాడ్ ప్రాంతంలోని సెయిట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండెజ్(26) టీచర్ గా పనిచేస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 6వ ఫ్లోర్ లో క్లాస్ ముగించుకున్న టీచర్.. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గర వేచిచూస్తోంది. ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగగా, ఆమె అందులో ప్రవేశిస్తుండగానే డోర్లు మూసుకుపోయాయి. దాంతో ఆ రెండు డోర్ల మధ్యన ఆమె చిక్కుకుపోయింది.

ఆ టీచర్‌ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు క్లోజ్ అయ్యాయి. పైన ఉన్న ఏడో అంతస్తుకు లిఫ్ట్ కదిలింది. దీంతో లిఫ్ట్‌ డోర్‌ బయట శరీరం, లోపల కాలు ఉండిపోయి.. ఆ లిఫ్ట్‌, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది. సహాయం కోసం టీచర్ గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పరుగున వచ్చారు. ఆ ఉపాధ్యాయురాలిని రక్షించే ప్రయత్నం చేశారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన టీచర్ ను బయటకు లాగారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ టీచర్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు జూన్ లో అసిస్టెంట్ టీచర్ గా స్కూల్లో జాయిన్ అయ్యింది.