Pravallika Death Case : స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు
అమ్మాయి ప్రవళికని శివ రామ్ రాథోడ్ అనే యువకుడు చీటింగ్ చేశాడని తెలిపారు. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడికి ఎంగేజ్ మెంట్ కుదిరిందన్నారు.

Student Pravallika death case
Pravallika Death Case – DCP Reveals Details : హైదరాబాద్ అశోక్ నగర్ లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్ కు చెందిన ప్రవళిక గ్రూప్స్ ప్రిపేర్ కోసం నగరారానికి వచ్చారని పేర్కొన్నారు. రీసెంట్ గా జరిగిన ఏ పరీక్షకు ఆమె అటెండ్ కాలేదన్నారు.
15 రోజులుగా హాస్టల్ లో ఉందని తెలిపారు. ప్రవల్లిక రూమ్ మేట్ సంధ్య అక్షయ శ్రుతి ప్రవల్లిక రూమ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ప్రవళిక మాట్లాడేది కాదన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి రూమ్ లో ప్రవళిక సూసైడ్ చేసుకుందని 8:30 గంటలకు సమాచారం వచ్చిందన్నారు. సంధ్యా ఫ్రెండ్స్ ను విచారణ చేశామని తెలిపారు. అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి ప్రవళిక రూమ్ లో పంచనామా చేశామని తెలిపారు.
Bandi Sanjay: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఇక లేఖలు సృష్టిస్తారు: బండి సంజయ్
సూసైడ్ నోట్ రాసి ఉందన్నారు. ప్రవళిక మొబైల్ ఫోన్ సీజ్ చేశామని వెల్లడించారు. ప్రవళిక అబ్బాయితో చాటింగ్ చేసి ఉందన్నారు. శివ రామ్ రాథోడ్ అనే యువకుడితో ప్రవళిక చాటింగ్ చేసి ఉందని తెలిపారు. ప్రవళిక లవ్ సింబల్స్ తో రాసిన లెటర్స్ సీజ్ చేశామని చెప్పారు. శుక్రవారం ఉదయం అశోక్ నగర్ లో బాలాజీ దర్శన్ హోటల్ వద్ద టిఫిన్ చేశారని తెలిపారు.
సీసీ కెమెరా ఫుటేజ్ సీజ్ చేశామని పేర్కొన్నారు. అమ్మాయి ప్రవళికని శివ రామ్ రాథోడ్ అనే యువకుడు చీటింగ్ చేశాడని తెలిపారు. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడికి ఎంగేజ్ మెంట్ కుదిరిందన్నారు. ప్రవళిక తమ్ముడు ప్రణయ్ కూకట్ పల్లిలో డిగ్రీ చేస్తున్నాడని తెలిపారు. శివ రామ్ ప్రవల్లిక ప్రేమ వ్యవహారం ప్రవళిక పేరెంట్స్ కి కూడా తెలుసన్నారు.
లవ్ లెటర్ మరియు సీసీ కెమెరా ఫుటేజ్, మొబైల్ ఫోన్, పూర్తి ఎవిడెన్స్ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపామని తెలిపారు. అమ్మాయి గ్రూప్స్ అప్లయ్ చేయలేదన్నారు. శివరాం రాథోడ్ పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని చెప్పారు. శివరాం రాథోడ్ సీడీఆర్ కలెక్ట్ చేస్తామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. స్టూడెంట్స్ పొలిటికల్ లీడర్స్ ధర్నా చేశారని పేర్కొన్నారు. నాయకులు, ధర్నా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.