లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

అత్తాకోడళ్ల గొడవ : 9 నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన తల్లి

Updated On - 11:28 am, Sat, 12 December 20

Telangana : 9 monthsbaby dies family members clash : అత్తామీద కోపంతో కూతుర్ని కుంపట్లో పెట్టిందంట..అనేది సామెత. కానీ అటువంటి ఘటన నిజంగానే జరింగింది. నిజ జీవితంలో జరిగే ఘటనలే సామెతలుగా మారతాయనే దానికి ఉదాహరణ మహాబూబ్ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అత్తా కోడళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ పసిబిడ్డ ఉసురు తీసింది. కోపంతో ఆ తల్లి చేసిన దారుణం ఏడాది కూడా నిండని పసిబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది.

వివరాల్లోకి వెళితే..మహబూమ్ జిల్లాలోని గండీడ్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య, సంతోషిలకు కొన్నేళ్ల కిందట పెళ్లి కాగా.. వీరికి తొమ్మిది నెలల కూతురు ఉంది. ఈ అంజయ్య గొర్రెల కాపరిగా పనిచేస్తుంటాడు. ప్రతీ ఇంటిలోనూ ఉన్నట్లే అంజయ్య ఇంటిలో కూడా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతుండేవి.

అంజయ్య తల్లీ, భార్యసంతోషిలకు మధ్య తరచూ గొడవలు జరిగే క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 11,2020)రాత్రి వంట చేసే సమయంలో సంతోషికి ఆమె అత్తకు మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ బాగా తిట్టుకున్నారు. పెద్దగా అరుచుకున్నారు. దీంతో గొడవ జరుగుతున్న సమయంలో సంతోషి తొమ్మిది నెలల కూతురు అత్త ఒడిలో ఉంది.

ఈ గొడవ కాస్తా పెద్దదై ఘర్షణకు దారితీసింది. దీంతో విచక్షణ మరిచిపోయి తీవ్ర ఆవేశానికి గురైన సంతోషి కూతురిని అత్త ఒడిలోంచి లాక్కుని ఏం చేస్తుందో కూడా తెలియని ఆవేశంలో కూతురిని నేల కేసి విసిరింది. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

సరిగ్గా అదే సమయానికి ఇంటికి వచ్చిన అంజయ్య కూతురు పరిస్థితి చూసి ఆగ్రహంతో భార్యపై ఊగిపోయాడు.నువ్వసలు తల్లివేనా? అని తిట్టి చుట్టుపక్కల వారి సహాయంతో పాపను కోస్గి మండల కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే పాప చనిపోయిందని డాక్టర్లు చెప్పటంతోఅంజయ్య భోరున విలపించాడు. అత్తమీద కోసం తన కన్నకూతురిని ప్రాణాలు తీసానని తెలిసిన సంతోసి కుప్పకూలిపోయింది. కిలకిలా నవ్వుతూ ఆడుకుంటూ బోసినవ్వులతో అందరిని నవ్వించే చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *