Telangana BJP: బీజేపీ లో భగ్గుమన్న అసంతృప్తులు.. కమలనాథుల్లో చిచ్చురాజేసిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ..

ఎన్నికల వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.

Telangana BJP: బీజేపీ లో భగ్గుమన్న అసంతృప్తులు.. కమలనాథుల్లో చిచ్చురాజేసిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ..

Telangana BJP

Telangana Assembly Elections 2023: తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు భగ్గుమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మొదటి విడత లిస్ట్ కమలనాథుల్లో చిచ్చురాజేసింది. టికెట్ దక్కనివారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధిష్టానం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముథోల్ టికెట్ దక్కకపోవటంతో నిర్మల్ జిల్లా‌ బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించింది. పటాన్‌చెరు టికెట్ ను నందీశ్వర్ గౌడ్ కు ఇవ్వడాన్ని ఎనిమిది మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు వ్యతిరేకిస్తున్నారు. పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మెదట లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డిని కలిసి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీకి మాజీ ఎమ్మెల్సీ మోహనరెడ్డి రాజీనామాచేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.

Read Also : TS BJP Candidates 1st List Release: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై ఈటల పోటీ

వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ రాకపోవడంతో రాకేశ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. యువకులకు పార్టీలో కోటా లేదా? అంటూ ఆయన అనుచరులు బీజేపీ అదిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజాసింగ్ పై ఉన్న సస్సెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్ టికెట్ ను మరోసారి ఆ పార్టీ అధిష్టానం రాజాసింగ్ కే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, రాజాసింగ్ పై సస్పెన్ ఉండటంతో ఆ నియోజకవర్టంలో విక్రంగౌడ్ టికెట్ ఆశించాడు. అయితే, రాజాసింగ్ కు ఆ స్థానాన్ని మరోసారి కేటాయించడంతో తనకు ఇతర నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విక్రమ్ గౌడ్ కలిశాడు.

Read Also : Komatireddy Rajagopal Reddy: ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

నర్సాపూర్ లో మురళీ యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సింగాయపల్లి గోపీ అధిష్టానంకు ఫిర్యాదు చేశారు. బీఫార్మ్ వచ్చేలోపు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశాడు. అదేవిధంగా రామగుండంలో కందుల సంధ్యారాణికి టికెట్ ఇవ్వడాన్ని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారు. ముందు నుంచి కష్టపడి పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకుండా సంధ్యారాణికి ఎలా ఇస్తారని కిషన్ రెడ్డిని కలిసి రాజేందర్ ప్రశ్నించినట్లు తెలిసింది. అదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్ కు టికెట్ ఇవ్వడం పట్ల సువాసిని బీజేపీ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆమెను అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.