Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు

దళిత బంధుకు బడ్జెట్ లో రూ. 17 వేల 700 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఏడాది 11 వేల 800 కుటుంబాలకు లబ్ది చేకూరిందని, ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి...

Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు.. రూ. 17, 700 కోట్లు కేటాయింపు

Dalitha Bandhu

Telangana Budget Dalitha Bandhu : వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి దళిత బంధు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత బంధుకు బడ్జెట్ లో రూ. 17 వేల 700 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఏడాది 11 వేల 800 కుటుంబాలకు లబ్ది చేకూరిందని, ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేస్తామని వెల్లడించారు.

Read More : TS Budget 2022-23 : ప్రభుత్వ ఖజానాకు ఎంత ధనం వచ్చిందనేది కాదు..అది ప్రజలకు ఎంతవరకు చేరంది అనేది ముఖ్యం

తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంతో పైలట్‌ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది. దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే లక్ష్యంగా మహిళల పేరు మీద నగదును జమ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రకటనపై ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో…ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించడం గమనార్హం.

Read More : Minister Harish Rao : తెలంగాణ అసెంబ్లీ.. బడ్జెట్ సెషన్ మొత్తం బీజేపీ సభ్యుల సస్పెండ్

ముందుగా భావించినట్లు హుజూరాబాద్ నుంచి కాకుండా.. ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి నుంచి ప్రారంభించారు. తర్వాత హుజూరాబాద్, ఖమ్మలోని చింతకాని, సూర్యాపేటలోని తిరుమలగిరి, నాగర్ కర్నూలులో చరగొండ, కామారెడ్డిలోని నిజాం సాగర్ మండలాలో ప్రారంభించారు. దీనిని మరింత విస్తరింప చేయాలనే ఆలోచనతో నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది. దళిత బంధు పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకని ఆ కుటుంబానికి నేరుగా రూ. 10 లక్షల నగదును బ్యాంకులో వేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొదటి దశలో తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వంద మంది కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 11 వేల 900 మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించింది.