Telangana : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి .. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి : TS CPI సెక్రటరీ
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి .. తెలంగాణ గవర్నర్ తిమిళిసై రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి అంటూ తెలంగాణ CPI సెక్రటరీ డిమాండ్ చేశారు.

CPI Secretary demands that governor system should be abolished
Telangana : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..తెలంగాణ గవర్నర్ తిమిళిసై రాష్ట్ర వదిలి వెళ్లిపోవాలి అంటూ సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులను రాజభవన్ చుట్టూ తిప్పించుకుంటున్నానను అంటూ వ్యాఖ్యానించిన తమిళిసై గవర్నర్ గా పనిచేస్తున్నారా? లేక బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అసలు గవర్నర్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోనే కాదు తమిళనాడు,కేరళ,ఢిల్లీల్లో గవర్నర్ల తీరు సరిగాలేదంటూ విమర్శించర్శించిన సీపీఐ కార్యదర్శి తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరు సరిగా లేదని త్వరలోనే రాజభవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.
యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు అంశంపై గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్ కు వస్తే చర్చిస్తామని స్పష్టంచేశారు తమిళిసై. ఈ లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో సీపీఐ తెలంగాణ సెక్రటరీ కూనంనేని ఏకంగా గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కాగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీతో దోస్తీ కట్టింది సీపీఐ.కమలం.. కరోనా కంటే ప్రమాదం.. రాష్ట్రంలో బీజేపీని బలపడనిచ్చేది లేదని కూనంనేని అన్నారు.రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తామని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. దేశంలో వామపక్షాల ప్రభావం కాస్త తగ్గినా.. పార్టీల ఉనికి చెక్కుచెదరలేదని అన్నారు. బీజేపీని ఎదుర్కొవటానికి తెరాసతో చేతులు కలిపామని.. కానీ, ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గేది లేదని టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన సందర్భం స్పష్టంచేశారు సాంబశివరావు.