Forest Officer Killed : ఫారెస్ట్ రేంజర్ హత్య.. తుపాకులు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటున్న అటవీశాఖ సిబ్బంది

తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. పోలీసులకు ఇచ్చినట్లు తమకూ తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్పారు.

Forest Officer Killed : ఫారెస్ట్ రేంజర్ హత్య.. తుపాకులు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటున్న అటవీశాఖ సిబ్బంది

Forest Officer Killed : గుత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంత్యక్రియలకు అటవీ శాఖ సిబ్బంది భారీగా హాజరయ్యారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మంత్రల వద్దకు చొచ్చుకెళ్లేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నించారు. మాకు న్యాయం చేయాలంటూ అటవీ శాఖ సిబ్బంది డిమాండ్ చేశారు.

అదే సమయంలో అటవీ శాఖ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి(నవంబర్ 24) నుంచి తెలంగాణలో విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెంలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పెద్దఎత్తున పాల్గొన్న ఫారెస్ట్ సిబ్బంది.. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రుల ఎదుట నినాదాలు చేశారు. పోలీసులకు ఇచ్చినట్లు తమకూ తుపాకులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్పారు.

Telangana : ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉందా?

ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్పారు. కాగా, ఎఫ్‌ఆర్ వో శ్రీనివాస రావు హత్యతో.. ఆయుధాలు ఇవ్వాలనే అటవీశాఖ సిబ్బంది డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది.

ఆయుధాలు ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని ఫారెస్ట్ సిబ్బండి చేసిన డిమాండ్ పై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి.

FRO Killed : ఫారెస్ట్ ఆఫీసర్ హత్యపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావు అంత్యక్రియలు ఖమ్మం ఈర్లపుడిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలకు మంత్రులు హాజరు కాగా.. ఫారెస్ట్‌ సిబ్బంది తమ నిరసన తెలపడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

6 నెలల క్రితమే గోత్తి కోయలు.. శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని అటవీశాఖ సిబ్బంది సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామన్నారు. ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలని నినాదాలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అటవీ అధికారులపై కొంతకాలంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భయపడుతూనే వారు డ్యూటీలు చేస్తున్నారు. ఓవైపు రాజకీయ నిర్ణయాలు మరోవైపు స్మగ్లర్ల బెదిరింపులు.. వీటి మధ్య బిక్కుబిక్కుమంటూ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని సిబ్బంది వాపోయారు. అత్యంత విలువైన అటవీ సంపద, భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారికి తుపాకులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు లేని కారణంగానే శ్రీనివాసరావు హత్య జరిగిందని సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, తమకు తుపాకులు ఇవ్వాలని అటవీశాఖ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు. జిల్లాలోని చండ్రగుంట మండలం బెండలపాడు వద్ద ఎర్రగూడు అటవీప్రాంతంలో ప్లాంటేషన్‌ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మొక్కలను నరకొద్దని గుత్తికోయలను హెచ్చరించారు. దీంతో గుత్తికోయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సహనం కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడున్న ఆయనను వెంటనే తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటారు. స్థానిక గిరిజన జాతి అయిన గుత్తికోయలు.. అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేకసార్లు ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ జరిగింది.