Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవ‌త్స‌రం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్

Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Tenth Exams

Tenth Exams : పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవ‌త్స‌రం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్లు తెలిపింది. గతంలో 6 సబ్జెక్టులకు 11 పేపర్లు ఉండేవి. దీంతో విద్యార్థులు 11 పరీక్షలు రాసేవారు. అయితే ఈ ఏడాది ఒక సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Almond Milk : బాదం పాలు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్టే?

కరోనాతో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలపై స్పష్టత లేదు. 11 పేపర్లు ఉంటాయా? లేక 6 పరీక్షలకే కుదిస్తారా? అనే అయోమయం టీచర్లు, విద్యార్థుల్లో ఉంది. దీనిపై తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఆరు పేపర్లే ఉంటాయంది. అలాగే హిందీతో పాటు ఉర్దూను ద్వితీయ భాషగా(సెకండ్ లాగ్వేజ్) పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ప‌ది ప‌రీక్షల విధానంపై విద్యాశాఖ కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నాటి పదో పరీక్షలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Coffee : రాత్రి సమయంలో కాఫీ తాగి నిద్రపోతున్నారా?

11 పేపర్ల కారణంగా పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతాయని, దీని వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని విద్యావేత్తలు అంటున్నారు. అసలే కరోనావైరస్ మహమ్మారి భయాలు పూర్తిగా తొలగని ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.