Dalithbandhu CM KCR : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదు

తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపారాయన.

Dalithbandhu CM KCR : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదు

Kcr

Dalithbandhu CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోయే దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం రైతుబంధు పథకం కోసం ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నట్లు, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురయ్యారని ఈ సందర్భంగా తెలిపారాయన. 2021, జూలై 21వ తేదీ బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

రక్షణ నిధి పేరిట ప్రతి జిల్లాకు నిధులు : –
దళిత బంధు పథకంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఎన్నికలు ఇంకా రెండున్నర ఏళ్లకు వస్తాయన్నా సీఎం కేసీఆర్….ఈ పథకంపై వంకర తింకర తిట్టేటోళ్లు చాలా మంది ఉన్నారన్నారు. తనను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవ్వరిని తిట్టలేదన్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, రాజకీయం చేస్తున్నారు అంటే చేయొద్దా అని ప్రశ్నించారు. తనకు రాజకీయ స్వార్థం ఉంటే దళిత బంధు పథకం గజ్వెల్ లోనే పెట్టేవాళ్లం కదా అని తెలిపారు. రక్షణ నిధి పేరిట ప్రతి జిల్లాకు నిధులు కేటాయిస్తున్నట్లు, రూ. 10 లక్షలు ఒట్టిగ పంచిపెట్టుడు కాదన్నారు.

ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయ్యొద్దు : –
ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దని సూచించారు. శాశ్వతంగా అధికారం ఎవ్వరికీ ఉండదని..ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. తనకు ఎన్టీఆర్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు మొదటిసారి అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటే…ఏకంగా 80 నిమిషాలు మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా..ఈ స్పీచ్ విన్న స్పీకర్ తనను కౌగిలించుకున్నారన్నారు.

పథకాల విషయంలో అనేక ఆలోచనలు : –
రాష్ట్రంలో అమలవుతున్న పథకాల విషయంలో అనేక ఆలోచనలున్నాయని, ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం గురించి వివరించారు. గొర్రెల ఉత్పత్తిలో రాజస్థాన్ ను పక్కకు నెట్టి తెలంగాణ నెంబర్ వన్ అయిందని, దీనిపై కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడారన్నారు. 2 వేల 70 మెగా వాట్ల తలసరి విద్యుత్ వినియోగంతో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు లక్ష్యం నెరవేరిందని, ఈ విషయంలో రైతులు ధీమాగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు సీఎం కేసీఆర్.