High Court : దళితబంధుపై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు

దళితబంధు పథకంపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌, బీజేపీ నేత డాక్టర్‌ చంద్ర

High Court : దళితబంధుపై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు

Dalitbandhu

Three petitions over Dalitbandhu : దళితబంధు పథకంపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌, బీజేపీ నేత డాక్టర్‌ చంద్రశేఖర్‌ పిటిషన్లు దాఖలు చేశారు. హుజూరాబాద్‌లో దళితబంధును యథావిధిగా కొనసాగించాలని తమ పిటిషన్‌లో కోరారు. దళితబంధుకు తాము వ్యతిరేకం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పిటిషన్లకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తోపాటు… కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, హుజూరాబాద్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు దళితబంధుపై ఈనెల 19న సీఎం కేసీఆర్ స్పందించారు. ఈసీ తన పరిధిని అతిక్రమించిందన్నారు. దళితబంధును ఈసీ ఎన్ని రోజులు ఆపగలదన్నారు. దళితబంధు విషయంలో ఎవరూ చింతించాల్సిన అవసరం లేదన్నారు. దళితబంధు అర్హులు ఆందోళన చెందవద్దన్నారు. ఉప ఎన్నిక తర్వాత తన చేతుల మీదుగా దళితబంధు పంపిణీ చేస్తానని తెలిపారు. దళితబంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అన్నారు. నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు అమలవుతుందన్నారు.

CM KCR : నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు : సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉపఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చిన విషయం తెలిసిందే. హుజురాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిధిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేసింది.

హుజురాబాద్‌లో ఉపఎన్నికలు ఉన్నందున దళితబంధుతో ఓటర్లు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి అమలు చేసుకోవచ్చని సూచించింది.

Telangana : దళిత బంధు పథకానికి రూ.250 కోట్లు విడుదల

సీఎం కేసీఆర్ దళితబంధును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో ఈ డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేశారు.