Telangana : గులాబీకి షాక్‌..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!

టీఆర్‌ఎస్‌ పార్టీకి ;పెద్ద షాకే తగిలింది. చెన్నూర్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ,ప్రేమ సాగర్ రావులతో కలిసి ఓదెలు ఢిల్లీ వెళ్లారు.

Telangana : గులాబీకి షాక్‌..కాంగ్రెస్ లో చేరుతున్న టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..!

Trs Ex Mla Nallala Odelu Meet Revanth Reddy He Will Join Cong

Telangana : టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. చెన్నూర్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ,ప్రేమ సాగర్ రావులతో కలిసి ఓదెలు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నాం రాహుల్ గాంధీ లేదా కేసీ వేణుగోపాల మసక్షంలో ఓదెలు కాంగ్రెస్ లో చేరనున్నారు. గతంలో ఓదెలు టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈక్రమంలో గత ఎన్నికల్లో ఓదెలుకు కేసీఆర్ సీటు ఇవ్వలేదు.దీంతో ఓదెలు అసంతృప్తిగా ఉన్నారు.దీంతో సీఎం కేసీఆర్ ఓదెలుకు పార్టీలో ఏదోక పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ఇప్పటివరకు ఓదెలు టీఆర్ఎస్ లోనే కొనసాగారు.కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురి అయిన నల్లాల ఓదెలు ఎట్టకేలకు కాంగ్రెస్ లోకి చేరాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి ఢిల్లీ వెళ్లారు.

నల్లాల ఓదేలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా పనిచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న నల్లాల ఓదేలు.. 2014లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓదేలుకు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. చెన్నూరు నుంచి బాల్క సుమన్ పోటీ చేశారు. అప్పుడే ఓదేలు పార్టీ మారుతారని భావించారు. కాని ఆయన కారు పార్టీలోనే కొనసాగారు. తర్వాత ఓదేలు భార్య భాగ్యలక్ష్మిని మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా నియమించారు కేసీఆర్.

అయితే ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఓదెలుకు విభేదాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అవి మరింతగా ముదిరిపోయాయి. నియోజకవర్గంలో బాల్క సుమన్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని నల్లాల ఓదేలు ఆరోపిస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనే ఆవేదన చెందారు. అందుకే పార్టీ మారాలని ఓదేలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్ లోకి వెళ్లిన ఓదేలు పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఓదేలును తీసుకుని ఢిల్లీకి వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన భార్య మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మితో పాటు మరికొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఓదేలుతో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది.