Telangana : ఎవరితో పొత్తు లేకుండా గెలుస్తాం.. అధికారంలోకి రావడమే లక్ష్యం

బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు.

Telangana : ఎవరితో పొత్తు లేకుండా గెలుస్తాం.. అధికారంలోకి రావడమే లక్ష్యం

Bandi

Bandi Sanjay BJP President : కుటుంబ పాలనను, గడీల పాలనను, అవినీతి పాలనను బద్దలు కొడతాం…ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి గెలుస్తామని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. బెంగాల్, తరహా, తాలిబాన్, పాకిస్థాన్ తరహా పాలన సీఎం కేసీఆర్ తీసికొచ్చినా..ఉద్యమాలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టడం జరిగినట్లు, భవిష్యత్ లో మరిన్ని సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. అధ్యక్షుడిగా బండి సంజయ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆశీర్వాద కార్యక్రమం జరిగింది.

Read More : GVL Narasimharao: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. జీవీఎల్ కీలక ప్రకటన

బండి సంజయ్ ని వేములవాడ వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బండి సంజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించిన కేంద్ర నాయకత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, జెపి నడ్డాకు, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల బాధలు తెలుసుకొని వారికి అండగా ఉంటామమనే భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పార్టీ కృషి చేస్తోందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా బీజేపీ స్పందిస్తుందని..అన్ని వర్గాల కోసం ఉద్యమలు చెప్పటిందనే విషయాన్ని ఆయన చెప్పారు.

Read More : Raja Singh On TRS : ఎన్ని కేసులు వేసినా నన్ను ఓడించలేకపోయారు-రాజాసింగ్

ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ హామీనిచ్చిందన్నారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు. ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న బండి సంజయ్.. రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీలను బదనాం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఏస్ పార్టీ, స్ట్రాటజీ టీంలు రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఆశీర్వాద కార్యక్రమానికి లక్ష్మణ్, రఘునందన్ రావు, స్వామిగౌడ్, విజయశాంతి, ఇంద్రాసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.