Aqua Farmers Problems : రొయ్య రైతుకు అకాల కష్టం.. ఆశాజనకంగా లేని వనామి రొయ్యల సాగు

Aqua Farmers Problems : ఆక్సిజన్‌ లోటు తలెత్తినచోట్ల హడావుడిగా పట్టుబడులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని సాగుదారులు చెబుతున్నారు. అయితే మార్కెట్ లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Aqua Farmers Problems : రొయ్య రైతుకు అకాల కష్టం.. ఆశాజనకంగా లేని వనామి రొయ్యల సాగు

Aqua Farmers Problems _ Special Story On Fish Farming

Updated On : December 15, 2023 / 4:52 PM IST

Aqua Farmers Problems : లాభాల పంటగా గుర్తింపు పొందిన రొయ్యల సాగు రైతులకు కలిసి రావడం లేదు. ఇప్పటిదాకా వైరస్‌ ఉద్ధృతితో నష్టాలు చవిచూసిన వారికి ప్రస్తుతం నేలచూపులు చూస్తున్న ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిండికేట్‌ మాయాజాలంలో చిక్కి అల్లాడుతున్నారు. ఇది చాలదన్నట్టు వాతావరణ మార్పులతో చేతికి అందొచ్చిన పంట దక్కుతుందో లేదోనని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.

Read Also : Areca Nut Cultivation : వక్కసాగుతో లాభాలు ప‌క్కా అంటున్న రైతు

పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. రైతులంతా ఈ సారి దిగుబడులపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్‌ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ సారిగి కూడా తెల్లమచ్చ వైరస్ విజృంబించడంతో పంటను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యాధికి మందు లేదని తెలిసినా ఏవో రసాయనాలు పిచికారీ చేస్తూ తమ వంతు ప్రయత్నాలు చేశారు.

Aqua Farmers Problems _ Special Story On Fish Farming

Aqua Farmers Problem

మార్కెట్లో ధరలపై రైతుల ఆందోళన : 
మరో వైపు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పుల వల్ల ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్‌ లోపం తలెత్తుతోంది. పీహెచ్‌(ఉదజని సూచిక) స్థాయి పెరిగి రొయ్యలు, చేపలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. నీటి మధ్య, అడుగుభాగంలో ఎక్కువసేపు ఉండిపోయి వ్యాధుల బారిన పడుతున్నాయి. ఆక్సిజన్‌ లోటు తలెత్తినచోట్ల హడావుడిగా పట్టుబడులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని సాగుదారులు చెబుతున్నారు. అయితే మార్కెట్ లో ధరలు కూడా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెల్లమచ్చల వ్యాధి తల్లి రొయ్య నుంచి గానీ, చెరువుల నిర్వహణ సరిగా లేకపోయినా వచ్చే అవకాశం ఉంది. నాణ్యమైన సీడ్‌ ఎంపికతో పాటు పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేత వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి, చెరువుల్లో ఆక్సిజన్‌ లోటు తలెత్తకుండా చూసుకోవాలంటున్నారు.

Read Also : Mixed Natural Farming : మిశ్రమ పండ్ల తోటల సాగుతో లాభాలు ఆర్జిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతు