Dragon Fruit Farming : ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు – అంతర పంటగా వక్కను సాగుచేస్తున్న ఏలూరు రైతు 

Dragon Fruit Farming : మారుతున్న ఆహారపు అలవాట్ల నేపద్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యపరమైన లాభాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.

Dragon Fruit Farming : ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు – అంతర పంటగా వక్కను సాగుచేస్తున్న ఏలూరు రైతు 

Intercropping in Dragon Fruit Farming

Updated On : October 15, 2024 / 9:34 PM IST

Dragon Fruit Farming : సంప్రదాయ పంటలు కాదని చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకొని సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రయోగాత్మకంగా ఎకరంలో వక్కలో అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులను పొందుతున్నారు.

మారుతున్న ఆహారపు అలవాట్ల నేపద్యంలో పండ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యపరమైన లాభాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. దీనినే ఆసరాగ చేసుకొని ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు నవీన్ కుమార్ గత ఏడాది ఎకరంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ ను సాగుచేశారు. అంతర పంటగా వక్కను నాటారు.

అయితే, ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుండి దిగుబడులు పొందుతున్నారు. వక్కనుండి మరో రెండేళ్ళ తరువాత కానీ దిగుబడులు రావు. అయితే ఈ రైతు పంటలకు ఎలాంటి రసాయ ఎరువులు, పురుగుమందులను వాడటం లేదు. కేవలం ప్రకృతి విధానంలోనే సాగుచేస్తున్నారు. వచ్చిన పంటను స్థానికంగానే అమ్ముతూ.. సొమ్ముచేసుకుంటున్నారు.

Read Also : Honey Bee Farming : తేనెటీగల పెంపకాన్ని ఉపాధిగా మల్చుకున్న మహిళ