Azolla Farming : రైతులకు వరంగా మారిన అజొల్లా.. పెట్టుబడులు తగ్గించుకుంటే చాలు.. అధిక దిగుబడులు ఖాయం!

Azolla Farming : చిన్న, చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజోల్లా.. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ మొక్క..  ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది .

Azolla Farming : రైతులకు వరంగా మారిన అజొల్లా.. పెట్టుబడులు తగ్గించుకుంటే చాలు.. అధిక దిగుబడులు ఖాయం!

Increase Azolla Farming

Updated On : January 27, 2025 / 10:57 AM IST

Azolla Farming : పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏఏటికాయేడు పెరుగుతుండటం.. ఆదాయ మార్గాలు అదేస్థాయిలో తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ.. రైతులకు అండగా నిలుస్తోంది.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

అజొల్లా. మరీ ముఖ్యంగా వరిసాగులో కీలకపాత్ర పోషించడంతోపాటు పాడిరైతులు, ఇతర జీవాల పెంచే రైతులకు వాటికి అవసరమైన మేత, దాణ ఖర్చులను తగ్గిస్తూ.. మంచి లాభాలు కలిగిస్తోంది. అయితే దీని ప్రయోజనాలేంటీ.. ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వెంకటలక్ష్మి.

చిన్న, చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజోల్లా.. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ మొక్క..  ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది .  ఇది పెరగానికి నేల అవసరంలేకుండా నీటిపైనే పెరుగుతుంది. అన్ని మొక్కల్లా కాకుండా.. దానికి అవసరమైన నత్రజని ఎరువులను వాతావరణం నుండి నేరుగా పొందగలదు.

Read Also : Mulberry Cultivation : కాసులు కురిపిస్తున్న పట్టుపురుగుల పెంపకం.. తక్కువ పెట్టుబడితో, ఏడాదంతా లాభాలు

అంతేకాదు పంటల్లో అధిక దిగుబడిని పెంచడం, మేత, దాణా కొరతను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా.. ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అలాంటి ఈ అజోల్లాను రైతు స్థాయిలో ఏవిధంగా పెంచుకోవచ్చు.. దాని ఉపయోగాలేంటో సవిరంగా తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వెంకటలక్ష్మి.