Chamanthi Sagu : చామంతి సాగులో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం సాగులో మెళకువలు
శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది.
Chamanthi Sagu : మార్కెట్ లో పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ పంటను నాటతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు వుండేవి. ప్రస్థుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో వున్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ వున్న ఈ పంటనుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోతవరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.
READ ALSO : ladies finger Cultivation : బెండతోటలకు మొజాయిక్ వైరస్ ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా వుంది. గిరాకీ ఎక్కువవటం, మార్కట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవటంతో పూల సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు గ్రీన్ హౌసులలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోను పూలసాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండు వుంటుంది .
READ ALSO : Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు
అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట, ఐదారు నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌస్ లలో సాగుచేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జులైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. అయితే ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకొని ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి.
READ ALSO : Vegetable Farming : కాక్ నూర్ కేరాఫ్ కూరగాయలు.. ఊరంతా కూరగాయల సాగు
అవి పిలక మొక్కలుగా తయారై జూన్, జులైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా వుంటుంది.. అంతే కాకుండా విత్తనం ఖర్చుకూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగుచేసి, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడుత పురుగు, ఆకుతొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలుగ జేస్తాయి. వేరుకుళ్లు తెగులు కూడా ప్రధాన సమస్యగా వుంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు.