Byadgi Chilli Farming : బ్యాడిగ మిర్చి సాగు.. మిర్చి అ‘ధర’హో!
Byadgi Chilli Farming : ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా మిర్చి తోటను చూడండీ.. ఇది బ్యాడిగ రకం. ఈ రకం మసాలాల తయారీకి బాగా సరిపోతుంది. అనేక ఆహార సంస్థలు తమ ఉత్పత్తుల కోసం ఈ రకాన్ని వాడుతుంటారు.

byadgi chilli farming cultivation
Byadgi Chilli Farming : మిర్చిలో రారాజు బ్యాడిగ రకం. వీటి నుండి తీసిన నూనె, రంగును కాస్మెటిక్, నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌లలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్ లో అధిక ధర పలుకుతుంది. ఈ రకాన్ని సాగుచేసిన రైతులకు లాభాల పంట పండుతుంది. అందుకే ఈ ఏడాది అనతంపురం జిల్లాలో చాలామంది రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేశారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్‌లో కూడా మంచి ధర పలుకుతుండటంతో లాభాలు అధికంగా వస్తాయంటున్నారు.
Read Also : Ground Nut Cultivation : రబీలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ సాగు.. పంటలో చేపట్టాల్సిన యాజమాన్యం
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా మిర్చి తోటను చూడండీ.. ఇది బ్యాడిగ రకం. ఈ రకం మసాలాల తయారీకి బాగా సరిపోతుంది. అనేక ఆహార సంస్థలు తమ ఉత్పత్తుల కోసం ఈ రకాన్ని వాడుతుంటారు. కాస్మెటిక్ ఉత్పత్తులలో, ఇది ప్రధానంగా నెయిల్ పాలిష్ , లిప్‌స్టిక్‌లలో వినియోగిస్తారు. అందుకే దిగుబడి తక్కువ వచ్చినా.. మార్కెట్ లో క్వింటా ధర రూ.50 నుండి 60 వేలు పలుకుతుంది. అధికంగా కర్ణాటక రాష్ట్రంలో సాగుచేస్తుంటారు రైతులు.
బ్యాడిగ రకం మిరప సాగు :
అయితే ఇటీవల కొంత మంది రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఈ రకాన్ని సాగుచేస్తున్నారు. ఈ కోవలోనే ఆత్మకూరు మండలం, తలుపూరు గ్రామానికి చెందిన రైతు సంకేపల్లి అమరనాథ్ రెడ్డి తనకున్న నాలుగున్నర ఎకరాల దానిమ్మతోటలో అంతర పంటగా సాగుచేశారు. మొత్తం నాలుగైదు కోతలు వచ్చే ఈ పంటలో ప్రస్తుతం మొదటి కోత జరుగుతోంది. ఇప్పటికే 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్ లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
బ్యాడిగ మిర్చి సాగు :
ఎకరాకు దిగుబడి 10 -15 క్వింటాలు
నాలుగున్నర ఎకరాలకు పెట్టుబడి రూ. 6 లక్షలు
వారానికి ఒకసారి రసాయన మందుల పిచికారి
బ్యాడిగ మిర్చిని ఆశించే చీడపీడలు :
ముడుత తెగులు
తెల్లదోమ
ఎర్రనల్లి
Read Also : Marigold Flower Cultivation : బంతిపూల సాగులో మెళకువలు.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం