Maize Crop : మొక్కజొన్నకు చీడపీడల బెడద – నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు 

Maize Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును అధిగమించేందుకు ఇటీవలికాలంలో రైతులు సులభమైన చిట్కాను కనుగొన్నారు.

Maize Crop : మొక్కజొన్నకు చీడపీడల బెడద – నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు 

Control of Cutworm in Maize Crop

Maize Crop : మొక్కజొన్న పంటకు  కత్తెరపురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది  ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్ లో వర్షాధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగుచేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగు, కాండం తోలుచు పురుగుల తోపాటు తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. వీటి  పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి  తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. ఎ. లవకుమార్ రెడ్డి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారటంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్ లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగుచేశారు. వివిధ ప్రాంతాల్లో 20 నుండి 40 రోజుల దశలో పంట ఉంది.

అయితే, గత ఏడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు కాండం తొలుచు పురుగు ఉధృతిని కూడా శాస్త్రవేత్తలు గమనించారు.   రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి.  ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు  శాస్త్రవేత్త డా. ఎ. లవకుమార్ రెడ్డి.

మొక్కజొన్న పంటలో ఎదిగిన లార్వాలు అధికంగా  ఉన్నట్లు గమనించినట్లైతే విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొవ్వుల్లో వేసుకోవాలి. అలాగే పూత తరువాత పాముపొడ తెగులు, మచ్చతెగులు ఆశించే అవకాశం ఉంది. రైతులు గమనించినట్లైతే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.

మొక్కజొన్నలో కత్తెర పురుగును అధిగమించేందుకు ఇటీవలికాలంలో రైతులు సులభమైన చిట్కాను కనుగొన్నారు. కేవలం బట్టలు ఉతికేందుకు వాడే సర్ఫ్ ద్వారా ఈ పురుగును సులభంగా అరికడుతున్నారు. 5 గ్రాముల సర్ఫ్ ను లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై  సర్ఫ్ ద్రావణం కారేలా పిచికారిచేస్తే చాలు, కత్తెర పురుగు అప్పటికప్పుడే చనిపోవటం జరుగుతోంది. శాస్త్రీయంగా ఇది నిరూపితం కానప్పటికీ రైతులు స్వానుభవం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

Read Also : Fish Farming : మంచినీటి చెరువుల్లో పెంచాల్సిన చేప రకాలు.. కొద్దిపాటి జాగ్రత్తలతో అధిక దిగుబడి!