Maize Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును నివారించే పద్ధతులు
Maize Crop : మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు మహమ్మారిలా దాపురించింది. ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Control Of Cutworm In Maize Crop
Maize Crop : మొక్కజొన్న పంటకు కత్తెరపురుగు మహమ్మారిలా దాపురించింది. ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రబీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ని రైతులు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు కనుక, మొక్క మొలిచిన దశనుండి రైతులు కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఈ పురుగు పైరు తొలిదశ నుండే తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది . ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. కాలిశెట్టి వాణిశ్రీ.
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తారు. వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తున్నారు రైతులు. మొక్కజొన్నను అక్టోబర్ మొదటి వారం నుండి నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు.
ఇప్పటికే విత్తన ప్రాంతాల్లో రెండాకుల దశలో ఉండగా.. మరికొన్నిప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు.. ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి. రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి. కత్తెర పురుగు ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. కాలిశెట్టి వాణిశ్రీ.
రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు పెద్దగా బయపడాల్సిన పనిచేలేదు. విత్తిన నాటి నుండి 30 రోజుల వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పూత దశ నుండి కోత దశ వరకు ఈ పురుగు వల్ల పెద్దగా నష్టం ఉండదు. అంతే కాదు రసాయన మందులు పనిచేయవు కాబట్టి లార్వాలను ఏరి చంపాలి. అయితే రసాయన మందులను సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కసుడుల్లో పిచికారి చేయాలి.
Read Also : Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న ప్రభుత్వ టీచర్